చర్చ, సత్తుపల్లి : తామరచెరువు పార్క్ లో నాగుపాము కలకలం

సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో గల తామర చెరువు పార్కులో నాగుపాము కలకలం రేపింది. పాము పార్కు లోపటికి వెళ్లే ప్రాంతంలో అటువైపు ఇటువైపు తిరిగే క్రమంలో పార్కులోకి వెళ్లే ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. సుమారు అరగంట పాటు ఆ ప్రాంతంలో తచ్చాడటంతో పార్కులోకి సేద తీర్చుకోడానికి వచ్చే ప్రజలు మరియు వాకర్స్ భయభ్రాంతులకు గురవుతున్నారు. పార్కు ఇరువైపులా ఉన్న చెత్తాచెదారం ఉండటంతో విష సర్పాలకు నిలయంగా మారిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా పార్కులోకి వెళ్లి వ్యాయామం చేసేవాళ్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పిల్లలతో వెళ్లేవారు కూడా చూసుకొని వెళ్లాలని తగు జాగ్రత్తలు తీసుకోవాలని మహిళలు, వృద్ధులు, ప్రజలు అనేకమంది వ్యాయామం చేయుటకు లోపటికి వెళ్లే క్రమంలో చూసుకొని వెళ్లాలని ఈ ప్రాంత ప్రజలు సూచిస్తున్నారు.