త్యాగాల పునాదులపై ఏర్పడిన పార్టీ సీపీఐ. ఖమ్మం లో బహిరంగ సభను జయప్రదం చేయాలి – సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు MLC నెల్లికంటి సత్యం, బాల నర్సింహ పిలుపు
త్యాగాల పునాదులపై ఏర్పడిన పార్టీ సీపీఐ

త్యాగాల పునాదులపై ఏర్పడిన పార్టీ సీపీఐ. ఖమ్మం లో జరిగే 100 సం “రాల ఉత్స వాలను జయప్రదం చేయండి . సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు MLC నెల్లికంటి సత్యం, బాల నర్సింహ పిలుపు నిచ్చారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయాలని గద్వాల నుండి ప్రారంభమై బస్ యాత్ర ఈ రోజు ఖమ్మం జిల్లాలో ప్రవేశించి కొణిజర్ల, వైరా,తల్లాడ,మీదగా ఏన్కుర్ వచ్చినా బస్ జతా కి సీపీఐ మండల సమితి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ తోఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన సెంటర్ జరిగినా సభ లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు MLC నెల్లికంటి సత్యం, బాల నర్సింహ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన పార్టీ దేశంలో పెద ప్రజల హక్కుల కోసం,చట్ట సభల్లో అనేక చట్టాలను చేయించి పెద ప్రజల అభ్యున్నతి కోసం పని చేసిన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ.ఒక ఘనమైన చరిత్ర కల్గి ఉన్న పార్టీ సీపీఐ తప్ప మరొక పార్టీ లేదు.దేశంలో ఒక నియంతృత్వ పాలన కొనసాగుతుంది.ప్రశ్నించే గొంతుక లను అణిచివేస్తు కార్పొరేట్ వ్యక్తులకు ఊడిగం చేస్తుంది.ఆనేక ప్రభుత్వ రంగ సంస్థలను ముసివేస్తే ఉద్యోగులను రోడ్డు మీదకు తీసుకొస్తుందని అన్నారు.ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగించాలని కోరారు.డిసెంబర్ 26 న ఖమ్మం లో లక్షలాది మంది తో జరిగే భారీ బహిరంగ సభ ను జయప్రదం చేయాలని కోరారు. ఈ బస్ జతలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంత్ రావు, జిల్లా కార్యదర్శి దండి సురేష్, సహాయ కార్యదర్శి జితేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు యర్రా బాబు, మండల కార్యదర్శి జాగర్లమూడి రంజిత్ కుమార్, సహాయ కార్యదర్శి జిల్లా సమితి సబ్యులు అమరనేని వీరభద్రం,బానోత్ రాంబాబు మండల నాయకులు మాడినేని వెంకన్న, నగదర్ రావు,పొన్నం రాంబాబు, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు