News & Views

చర్చ, సత్తుపల్లి: సత్తుపల్లి లో సైబర్ క్రైమ్ కేసు కలకలం..

  • రూ 2.50.కోట్లు ఖాతాలో జమ పై ఫిర్యాదు…
  • పోలీసుల గోప్యత పై అనుమానాలు.

సత్తుపల్లి నియోజకవర్గంలో కల్లూరు మండలం ఎర్రబోయిన పల్లి గ్రామానికి చెందిన పోట్రు ప్రవీణ్, ప్రకాష్, యేపూరి గణేష్, వేంసూరు మండలం లింగపాలెం గ్రామానికి చెందిన మోరంపూడి చెన్నకేశవ, టీ పవన్ కుమార్ తో కలిసి హైదరాబాద్, కలకత్తాలో ఏడుగురు కాల్ సెంటర్లు ఉద్యోగులను ఏర్పాటు చేసి కాల్ సెంటర్లో టెక్నికల్, సాఫ్ట్వేర్ హ్యాకింగ్, మీద అనుభవం ఉన్న ఉద్యోగులను రిక్రూట్మెంట్ చేసుకొని ఆస్ట్రేలియా దేశానికి చెందిన పౌరులకు ఫేక్ మెయిల్స్, పంపి వారి కంప్యూటర్స్ హ్యాక్ చేసి కస్టమర్ సర్వీస్ నెంబర్ వారు వీళ్ళని సంప్రదించే లాగా నెంబర్లు ఇచ్చి ఎనీ డెస్ క్ సహాయంతో సూమారు 40.మంది ఆస్ట్రేలియా దేశానికి చెందిన పౌరులు ఎనీ డెస్క్ సహాయంతో హెల్ప్ లైన్ ను సంప్రదించగా వారి కంప్యూటర్లు యాక్ చేసి ఎకౌంటు వివరాలతో కూడిన సమాచారం అకౌంట్లో ఉన్న డబ్బులు ఆస్ట్రేలియాలో ఉన్న ఇండియన్ స్టూడెంట్స్ ఖాతాలకు మళ్లించి అక్కడి నుంచి కీప్టో కరెన్సీ ద్వారా తిరిగి ఇండియాకి రప్పించారని ఫిర్యాదు మేరకు ఆస్ట్రేలియా ఇంటిలిజెన్సీ విభాగం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించగా సుమారు రూ.8 నుంచి 10 కోట్ల సైబర్ క్రైమ్ భారీ కుంభకోణం వెలుగులోనికి వచ్చింది. దీనిపై ఆరుగురు వ్యక్తులపై సైబర్ క్రైమ్ ఎస్ ఓ టి పోలీసులు కేసు నమోదు చేసి పలువురిని ఇటీవల అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు,…….

రూ 2.50 కోట్లు ఖాతాలో చేరటం పై ఫిర్యాదు
సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామానికి చెందిన ఒకరు ఖాతాలో ఇటీవల రూ 2.50.కోట్లు రూపాయలు నగదు విదేశాల నుంచి హవాలా రూపంలో వచ్చి చేరటం పై పోలీసులకు ఖాతా దారుడు ఫిర్యాదు చేయగా ఆ కేసు దర్యాప్తు జరుగుతుండగా ఈ కేసులో పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు ముఖ్య అనుచరులు 4.గురు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఎన్నికల సందర్భంలో సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో హవాలా డబ్బుతోనే రెబల్ అభ్యర్థులను గెలుపుకు వినియోగించారని పలువురు నాయకులు ఫిర్యాదు చేయడంతో సత్తుపల్లి లోని ముఖ్య అనుచరులు ఆందోళనకు గురి అవుతున్నారు. ఇది ఇలా ఉండగా ముఖ్య అనుచరుల్లో కొందరు ఇటీవలే ప్రత్యేక పూజలు ఏర్పాటు చేసి కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని విలాసవంతమైన వాహనాలు కొనుగోలు చేసి దర్జాగా తిరుగుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీని వెనకాల నలుగురు పాత్ర కూడా ఉన్నట్లు గుసగుసలు బహిరంగంగానే వినపడుతున్నాయి. ఈ నలుగురిపై సైబర్ క్రైమ్ పోలీసులు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు విశ్వసనీయ సమాచారం వీరికి సైబర్ క్రైమ్ ఇటీవల సైబర్ క్రైమ్ కేసులో అరెస్ట్ అయిన వ్యక్తులకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో సైబర్ క్రైమ్ ఎస్ఓ టి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు…..
పోలీసుల గోప్యత పై అనుమానాలు
రూ 10.కోట్ల విలువైన సైబర్ నేరానికి పాల్పడినట్లు ఆరోపణల కేసులో నమోదయింది ఇందులో కల్లూరు మండలం ఎర్రబోయిన పల్లికి చెందిన పోటు ప్రవీణ్ ప్రధాన నిందితుడుగా పోలీసులు గుర్తించారు. మరో ఆరుగురి పాత్ర ఉందని పోలీసులు విచారణలో తేల్చారు. ఈ మేరకు ఇటివల ప్రవీణ్ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించి రెండు రోజులు గడిచినా పోలీస్ శాఖ నుంచి అధికారికంగా సమాచారం మీడియాకు విడుదల చేయకపోవడం చర్చ నీయంగా మారింది. పోలీస్ శాఖ సవాలుగా తీసుకున్న ఈ కేసు దర్యాప్తు వేగంగా జరుగుతున్నప్పటికీ గోప్యత ప్రదర్శించటానికి పై రాజకీయ ఒత్తిళ్లు కారణమా..? ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. చిన్న పాటి కేసు నమోదు అయితేనే ప్రెస్ మీట్ పెట్టి లేదా ప్రెస్ నోట్ విడుదల చేస్తారు కానీ దేశాల మధ్య జరిగిన సైబర్ నేరంలో సూత్రధారులు పాత్రధారులు ఎవరు విచారణ ఎంత పూర్తయిందో బయటికి చెప్పకపోవడం పై, రాజకీయ విశ్లేషకులు, స్థానిక ప్రజల నుంచి పలు అనుమానాలు సందేహాలు వ్యక్తంఅవుతున్నాయి.