చర్చ : అశ్వారావుపేట , డ్రగ్స్ పై యుద్ధం – దమ్మపేట పోలీసులు నాకాబంధి , మందలపల్లి, అచ్యుతాపురం క్రాస్ రోడ్ల వద్ద ఉదయం నాకాబంది నిర్వహించారు……


డ్రగ్స్ పై యుద్ధం – దమ్మపేట పోలీసులు నాకాబంధి.
=>మందలపల్లి, అచ్యుతాపురం క్రాస్ రోడ్ల వద్ద ఉదయం నాకాబంది.
=> వాహన తనిఖిలు చేసిన పోలీసులు.
డ్రగ్స్ వినియోగం మరియు రవాణాపై నియంత్రణ చర్యలు వేగం పుంజుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న “చైతన్యం – డ్రగ్స్ పై యుద్ధం” కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం దమ్మపేట పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృత నాకాబంది నిర్వహించబడింది.
తెల్లవారుజామున 4 గంటల నుండి 6 గంటల వరకు సాగిన ఈ నాకాబందిలో వాహనాలను ఒక్కొక్కటిగా ఆపి పూర్తిస్థాయి తనిఖీలు చేశారు. ప్రతి వాహనంలోని ప్రయాణికుల వివరాలను సేకరించి, అనుమానాస్పద వస్తువులు ఉన్నాయేమో పరిశీలించారు. పోలీసులు ప్రధానంగా మత్తు పదార్థాల రవాణాపై దృష్టి సారించారు. పోలీసులు వాహనాలను మందలపల్లి క్రాస్ రోడ్ మరియు అచ్యుతాపురం క్రాస్ రోడ్ ఈ రెండు ప్రాంతాల వద్ద ప్రధాన రహదారులపై ఉన్నందున పోలీసులు వాహనాల కదలికలను నిశితంగా గమనించారు.
ఈ కార్యక్రమంలో దమ్మపేట ఎస్సై సాయి కిషోర్ రెడ్డి, అదనపు ఎస్సైలు బాలస్వామి, రాఘవయ్య మరియు పోలీస్ సిబ్బంది పాల్గొని తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్సై సాయి కిషోర్ రెడ్డి మాట్లాడుతూ
ప్రజల సహకారంతోనే డ్రగ్స్ రహిత సమాజం సాధ్యమవుతుంది. ఎవరైనా గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలను సేవించినా, రవాణా చేసినా కఠిన చట్టపరమైన చర్యలు తప్పవు. యువత భవిష్యత్తు కోసం ఇలాంటి అవగాహన కార్యక్రమాలు తరచుగా కొనసాగుతాయి” అని తెలిపారు.
అదేవిధంగా, డ్రగ్స్ దందా లేదా అనుమానాస్పద కార్యకలాపాల గురించి ఎవరికైనా సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతోనే నేరాల నిర్మూలన సాధ్యమని అధికారులు పేర్కొన్నారు.
ఈ నాకాబందీ కేవలం తనిఖీలకే పరిమితం కాదు, ప్రజల్లో చైతన్యం కలిగించే ప్రయత్నం కూడా. ప్రతి ఒక్కరూ తమ కుటుంబం, సమాజం, పాఠశాలల్లో డ్రగ్స్ పై అవగాహన పెంచాలి. యువతను మత్తు పదార్థాల దారిలోకి వెళ్లకుండా అడ్డుకోవాలి అన్నారు.
ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించి, డ్రగ్స్ రహిత ప్రపంచ సాధనలో భాగస్వాములు కావాలని కోరారు.