News & Views

చర్చ,పెద్దపల్లి: సర్పంచి ఎన్నికల్లో అత్తపై కోడలు విజయం. ఆసక్తి కరంగా మారిన ఎన్నిక..

సర్పంచి ఎన్నికల్లో అత్తపై కోడలు విజయం.

  • ఆసక్తి కరంగా మారిన ఎన్నిక..

పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఘన శ్యాందాస్ నగర్ పంచాయతీలో సర్పంచి ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఒకే కుటుంబానికి చెందిన అత్తా–కోడలు మధ్య పోటీ కొనసాగింది. చివరికి కోడలుకు విజయం వరించింది.
బీసీ మహిళకు రిజర్వ్ అయిన సర్పంచి స్థానానికి మాజీ సర్పంచ్ సూర సమ్మయ్య తన తల్లి సూర నర్సమ్మను బరిలో దింపారు.నర్సమ్మ పెద్దకోడలు సూర రమాదేవి కూడా నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక ఆసక్తికరంగా మారింది. గతంలో కన్నాల గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో, ప్రత్యేక పంచాయతీగా ఘన శ్యాం దాస్ నగర్ ఏర్పడ్డ తర్వాత కూడా సమ్మయ్య కుటుంబం సర్పంచి పదవిని దక్కించుకుంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో అత్త నర్సమ్మపై కోడలు సూర రమాదేవి విజయం సాధించారు. ఈ ఫలితం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.