News & Views

చర్చ, సత్తుపల్లి : సత్తుపల్లినుండి వాడపల్లికి ప్రతి శుక్రవారం డీలక్స్ బస్సు – డిపో మేనేజర్ ఊటుకూరి సునీత

సత్తుపల్లినుండి వాడపల్లికి ప్రతి శుక్రవారం డీలక్స్ బస్సు.- డిపో మేనేజర్ ఊటుకూరి సునీత

చర్చ, సత్తుపల్లి: సత్తుపల్లి డిపో నుండి ఆంధ్రప్రదేశ్ లోని వాడపల్లికి ప్రతి శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రత్యేక డీలక్స్ బస్సు ఏర్పాటు చేసినట్లు సత్తుపల్లి డిపో మేనేజర్ ఊటుకూరి సునీత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సత్తుపల్లి డిపో నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుణ్యక్షేత్రమైన వాడపల్లి ప్రతి శుక్రవారం డీలక్స్ బస్సు నడుపుటకు ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. శుక్రవారం రాత్రి 10 గంటలకు సత్తుపల్లి బస్టాండ్ నుండి డీలక్స్ బస్సు బయలుదేరి వాడపల్లి చేరుకుంటుందని. దర్శనానంతరం ఉదయం 8 గంటలకు వాడపల్లి నుండి బస్సు బయలుదేరుతుందని అన్నారు. చార్జీ పెద్దలకు 630 రూపాయలు పిల్లలకు 340 నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. ఆన్లైన్ రిజర్వేషన్ ద్వారా టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చునని అన్నారు. రిజర్వేషన్ నెంబర్ 68515 నంబర్తో టికెట్ల బుకింగ్ చేసుకోవచ్చు అన్నారు. సత్తుపల్లి డిపో పరిధిలోని భక్తులందరూ ఈ సదా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా డిపో మేనేజర్ కోరారు. మరిన్ని వివరాలకు 9866619189,9550767375, 9959225962 లను సంప్రదించవచ్చునని అన్నారు.