చర్చ,గోదావరిఖని: అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొనసాగుతున్న వివిధ అబివృద్ది కార్యక్రమాలను
బుధవారం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ గోదావరిఖని సమ్మక్క- సారలమ్మ గద్దెల వద్ద సింగరేణి ఆధ్వర్యంలో చేపట్టిన పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. మున్సిపల్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సింగరేణితో సమన్వయం చేసుకుంటూ పనులు పూర్తి చేయాలన్నారు.
గోదావరిఖని నది ఒడ్డున ఉన్న స్మశాన వాటిక అభివృద్ధి కోసం డి పి ఆర్ తయారు చేయాలని అదికారులకు సూచించారు. అశోక్ నగర్ లోని గర్ల్స్ హై స్కూల్ అభివృద్ధి కోసం కోటి రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. డిజైన్ ప్రకారం అభివృద్ధి పనులను నెల రోజులలో పూర్తి చేయాలని అదికారులను ఆదేశించారు.
గౌతమ్ నగర్ వద్ద గల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు వేగంగా పూర్తి చేయాలని అదికారులను ఆదేశించారు. రామగుండం చౌరస్తా వద్ద చేపట్టిన ఆర్ అండ్ బి రోడ్డు నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని అదికారులను ఆదేశించారు.
ఈ పర్యటనలో కలెక్టర్ వెంట అడిషనల్ కమిషనర్ మారుతి ప్రసాద్, గురు వీర, ఈఈ రామన్ ,ఆర్ అండ్ బి ,అదికారులు పాల్గొన్నారు.