చర్చ,గోదావరిఖని: సైలెంట్ కిల్లర్ డయాబెటిస్…- జీవనశైలి మార్పుతోనే ఆరోగ్యం – కరీంనగర్ మెడికవర్ వైద్యుల వెల్లడి….
సైలెంట్ కిల్లర్ డయాబెటిస్
చర్చ,గోదావరిఖని:
సైలెంట్ కిల్లర్ డయాబెటిస్…
– అన్ని రకాల వ్యాధులకు మూలంగా షుగర్
– జీవనశైలి మార్పుతోనే ఆరోగ్యం
– కరీంనగర్ మెడికవర్ వైద్యుల వెల్లడి….
—–
డయాబెటిస్ మిగతా వ్యాధులలాగా కాకుండా ఇది సైలెంట్ కిల్లర్ గా తయారవుతుందని కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి జనరల్ ఫిజీషియన్ డాక్టర్ నాగరాజు, ఎమర్జెన్సీ మెడిసిన్ డాక్టర్ సత్యనారాయణ, క్రిటికల్‌కేర్ నిపుణులు డాక్టర్ ఉపేందర్ రెడ్డి అన్నారు. వరల్డ్ డయాబెటిస్ డే సందర్బంగా శుక్రవారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. డయాబెటిస్ రావడానికి కేవలం మన నిర్లక్ష్యమే కారణమన్నారు. మనిషి ప్రతిరోజు తినడంపై ఉన్న శ్రద్దను వ్యాయామం చేయడంపై పెట్టడం లేదని తెలిపారు. దీని కారణంగానే 100 ఏళ్ల ఆయుష్షు 60 ఏళ్లకు తగ్గిందని ఆందోళన వ్యక్తం చేశారు. షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో లేకపోతే చాల ప్రమాదకరమన్నారు. ముఖ్యంగా గుండె, బ్రెయిన్ స్ట్రోక్‌లకు, కిడ్నీ వ్యాధులకు డయాబెటిసే మూలంగా మారిందని తెలిపారు. ఆరోగ్యవంతమైన జీవనం సాగించాలంటే ప్రతి 3-4 నెలలకోసారి డయాబెటిస్ చెక్ చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం మదుమేహం బారత్‌లో అత్యంత ప్రమాదకంగా మారిందని, ప్రతి ఆరుగురిలో ఒకరికి డయాబెటిస్ ఉంటుందన్నారు. వీరితో పాటు ప్రీ డయాబెటిస్ బాధితులు కూడా ఉన్నారని తెలిపారు. ఇటీవల ప్రజల్లో డయాబెటిస్ పై అవగాహన పెరిగిందని.. దానికి రెండింతలు అపోహలు కూడా పెరిగాయన్నారు. తినడం దగ్గర నుంచి ట్రీట్‌మెంట్ వరకు చాలా మందికి అనుమానాలు ఉన్నప్పటికీ నివృత్తి చేసుకోవడం లేదన్నారు. ప్రీ డయాబెటిస్ ఉన్న వారికి వారి ఆరోగ్యం వారి చేతిలోనే ఉంటుందని తెలిపారు. ఏది తిన్నా తక్కువగా తినాలి… కొద్ది కొద్దిగా ఎక్కవ సార్లు తినాలి… వారంలో ఐదు రోజులు వ్యాయామం తప్పని సరిగా చేయడం అలవాటుచేసుకోవాలన్నారు. 30-35 వయస్సు వచ్చాక తప్పనిసరిగా పరీక్షలు చేసుకోవాలనిసూచించారు. షుగర్ నియంత్రణలో లేకపోతే గుండె జబ్బులు, కిడ్నీల వైఫల్యం, చూపు తగ్గడం, నరాల బలహీనత వంటి అనే సమస్యలు తలెత్తుతాయన్నారు. ఒక్కోసారి షుగర్ వల్ల పేషెంట్ కోమాలోకి కూడా వెళ్లే పరిస్థితి ఉంటుందని తెలిపారు. ఒక సారి కిడ్నీ పాడైతే జీవితాంతం డయాలసిస్‌కు వెళ్లాల్సివస్తుందని వెల్లడించారు. ఇక కొంత మందికి పుట్టుకతోనే ఇన్సూలిన్ లోపం కారణంగా డయాబెటిస్ వస్తుందని తెలిపారు. డయాబెటిస్ బారినపడకుండా ఉండాలంటే ఒత్తిడిని తగ్గించుకొవడంతో పాటు జీవన శైలిలో మార్పులతోనే సాధ్యపడుతుందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మెడికవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్, మార్కెటింగ్ మేనేజర్ కోట కర్ణాకర్, బొంగోని హరీష్, రమేశ్, యూనస్ తదితరులు పాల్గొన్నారు.