చర్చ, సత్తుపల్లి : అధికారుల నిర్లక్ష్యంతో ఆసుపత్రి ప్రాంగణంలో డయాలసిస్ నీరు నిల్వ….
ఏడాది గా గర్భిణీలు, బాలింతలు చిన్నారులకు తప్పని ఇబ్బందులు

డయాలసిస్ నీరు కు దారేది….?
*ఏడాది గా గర్భిణీలు, బాలింతలు చిన్నారులకు తప్పని ఇబ్బందులు…
*అధికారుల నిర్లక్ష్యంతో ఆసుపత్రి ప్రాంగణంలో డయాలసిస్ నీరు నిల్వ….
చర్చ, సత్తుపల్లి:
సత్తుపల్లి ఆస్పత్రి ప్రాంగణంలో డయాలసిస్ రోగులకు వినియోగించే మిషనరీ నుంచి వెలుపడే వృదా నీరు 24 గంటలకు.24/7 రోజుకి ఒక్కో డయాలసిస్ మిషన్ నుంచి 50. నుంచి 60. లీటర్లు ఫ్లూయిడ్ ఇంజక్షన్ వినియోగించడం ద్వారా డయాలసిస్ రోగుల శరీరం నుంచి తీసిన నీరు, మిషన్ నుంచి వెలుపడే నీరు ఆసుపత్రి ప్రాంగణంలో చేరి ఆస్పత్రి ప్రాంగణం చెరువులు తలపించే లాగా నీరు నిల్వ ఉండటంతో ఆస్పత్రి డయాలసిస్ కేంద్రానికి పక్కనే ఉన్న మాత శిశు సంరక్షణ కేంద్రం పరిసర ప్రాంతాలలోకి నీరు ప్రవేశించి మాత శిశు సంరక్షణ ఆసుపత్రి ప్రాంగణం నీరు నిలవడంతో ఆ ప్రాంతమంతా పాకుడు పట్టి గర్భిణీలు ,బాలింతలు చిన్నారులు ఆసుపత్రి ప్రాంగణంలోకి వెళ్లేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. డయాలసిస్ మిషనరీ నుంచి వెలుబడిన నీటిని ప్రత్యేకమైన ట్యాంక్ నిర్మాణం చేపట్టి చేపట్టి డయాలసిస్ మిషనరీ ద్వారా వచ్చిన ఇంజక్షన్, ఫ్లూయిడ్, లిక్విడ్ వృధా నీటికి ప్రత్యేకమైన ట్యాంక్ నిర్మాణం ఏర్పాటు చేయకపోవడంతో ఆస్పత్రి ప్రాంగణంలో చెరువును తలపించే లాగా నీరు నిల్వ ఉంటుందని రోగులు సందర్శికులు ఆరోపిస్తున్నారు. పాత ఆస్పత్రి ప్రాంగణానికి ఆనుకొని ఉన్న వంద పడకల ఆసుపత్రికి వెళ్లే మార్గంలో ఓపెన్ ప్రదేశాల్లో నీరు నిల్వ ఉండటంతో విపరీతమైన దోమలు, ఈగలు చేరటం తో పాటు మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ఉండే చిన్నారులను ఉదయం 8 గంటల లోపు సూర్యుడు వేడిమికి చిన్నారులను అదే ప్రాంతంలోకి ఆరు బయటికి తీసుకురావడంతో చిన్నారుల, ఆస్పత్రిలో గర్భిణీలు బాలింతలు ఆసుపత్రి రోగులు సిబ్బంది రోగాల పాలవుతున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి,గత ఏడాది నుంచి సత్తుపల్లి ప్రాంతంలో డయాలసిస్ రోగులు రోజురోజుకి పెరగటంతో డయాలసిస్ మిషన్ లు రోగులకు డయాలసిస్ సేవలు అందించేందుకు 24 గంటలు ఐదు మిషన్లు రన్ అవటంతో రోజుకి సూమారు 20 నుంచి 25 మంది రోగులకు డయాలసిస్ జరుగుతుందని. దీంతో ఒక్కొక్క మిషన్ నుంచి 50 లీటర్ల నుంచి 60 లీటర్ల మిషనరీ లో ఉన్న ఇంజక్షన్, ఫ్లూయిడ్, లిక్విడ్ మందులు కలిపిన వృధా నీరు ఆస్పత్రి ప్రాంగణంలో ప్రత్యేకమైన ట్యాంక్ ను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉన్నప్పటికీ డయాలసిస్ ద్వారా వచ్చిన నీటిని ఆసుపత్రి ఆరుబయట నిల్వ ఉంచడం ఏంటని పలువురు ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. గత ఏడాది నుంచి డయాలసిస్ నీరు ఆసుపత్రి ప్రాంగణంలో నిల్వ ఉండటంతో గర్భిణీలు బాలింతలు, చిన్నారులతో పాటు ఆసుపత్రికి విచ్చేసిన రోగులు రోగాల పాలవుతున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా వైద్యాధికారులు ఆస్పత్రి ప్రాంగణాన్ని సందర్శించి డయాలసిస్ కేంద్రం నుంచి వెలుబడిన వృధా నీటికి ప్రత్యేకమైన ట్యాంక్ నిర్మాణం ను ఏర్పాటు చేయటంతో పాటు ఆసుపత్రి ప్రాంగణంలో నీరు నిల్వ కుండా చూడాలని ఆసుపత్రి రోగులతో పాటు డయాలసిస్ రోగులు స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు..