చర్చ , భద్రాద్రి కొత్తగూడెం: చర్చ, ఎఫెక్ట్: ఆక్రమణదారుడికి నోటీసులు జారీ చేసిన సెక్రటరీ
చర్చ’ ఎఫెక్ట్…
ఆక్రమణదారుడికి నోటీసులు జారీ చేసిన సెక్రటరీ
చర్చ బ్యూరో, భద్రాద్రి కొత్తగూడెం:
చుంచుపల్లి మండలం నందా తండా గ్రామపంచాయతీ పరిధిలోగల పల్లె దవాఖాన వెనుక వీధిలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఆకమ్రించిన వ్యక్తికి పంచాయతీ సెక్రటరీ భూమిక బుధవారం నోటీసులు జారీ చేశారు. ‘అధికారుల సహకారంతో ప్రభుత్వ భూమి కబ్జా…?’ పేరుతో ‘చర్చ’ దినపత్రికలో బుధవారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. సెలవులపై ఉన్న పంచాయతీ సెక్రటరీ విధులకు హాజరైన సందర్భంగా బుధవారం ఫీల్డ్ విజిట్ చేసి, గోడల నిర్మాణం చేపట్టడానికి ప్రయత్నించిన లకావత్ రవితోపాటు మంచినీటి పైపులైను దాటి ఆక్రమించి కంచెలు వేసిన మరో నలుగురు గ్రామస్తులకు నోటీసులు జారీ చేసారు. ఎంపీఓ ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేశానని, ఫీల్డ్ విజిట్ చేసి నిజ నిర్ధారణ చేస్తామని తెలిపారు. ఎన్నికల విధుల కారణంగా ఫీల్డ్ విజిట్లో జాప్యం జరుగుతుందని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని, ఆక్రమణలు తేలితే చర్యలు తీసుకుంటామని చెప్పారు.