చర్చ, సత్తుపల్లి: ఎన్నికల సామాగ్రి పంపిణీ..



ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం లోని జేవిఆర్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో అధికారులు ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.మొత్తం మండలంలో 18 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా ఆయా గ్రామ పంచాయతీలకు సంబంధించిన పోలింగ్ సామాగ్రిని సిబ్బందికి అందచేసేందుకు కౌంటర్ లను ఏర్పాటు చేశారు.సత్తుపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాలలో 116 గ్రామ పంచాయతీలలో రేపు ఎన్నికలు జరగనున్నాయి.మొత్తం 1,83,734 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.