చర్చ, పెద్దపల్లి: రైతులకు సరిపడా 10 వేల 131 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
సాగు చేసే రైతులకు సరిపడా యూరియా స్టాక్ జిల్లాలో అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
యాసంగి సీజన్ లో సాగు విస్తీర్ణం , రైతుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని 38 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని ప్రణాళికలు తయారు తయారు చేసామని, జిల్లాకు ఇప్పటివరకు 15 వేల 162 మెట్రిక్ టన్నుల యూరియా స్టాక్ వచ్చిందని కలెక్టర్ తెలిపారు.
రైతులకు సకాలంలో యూరియా పంపిణీ చేసేందుకు అన్ని మండలాల్లో సమగ్ర చర్యలు చేపట్టామని, మార్క్ ఫెడ్ ద్వారా యూరియా నిల్వలను ప్యాక్స్ (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు), ఏ.ఆర్.ఎస్.కే (వ్యవసాయ రైతు సేవా కేంద్రాలు), డి.సీ.ఎం (జిల్లా కోపెరేటివ్మార్కెటింగ్సొసైటీస్) , ఎఫ్.పి.ఓ (రైతు ఉత్పత్తి దారుల సంస్థలు)లకు అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు.
ప్రస్తుతం మన పెద్దపల్లి జిల్లాలో 10 వేల 131 మెట్రిక్ టన్నుల యూరియా స్టాక్ అందుబాటులో ఉందని తెలిపారు. జిల్లాలోని రైతులు యూరియాను ముందస్తగా ఫర్టిలైజర్ బుకింగ్ అప్ ద్వారా బుక్ చేసుకొని , ప్రశాంతంగా విడతల వారీగా మీకు అవసరమైన యూరియా బస్తాలు పొందవచ్చుని తెలిపారు
ప్రతి మండలంలో సొసైటీలు, ప్రైవేట్ డీలర్ల వద్ద యూరియా నిల్వలను అందుబాటులో ఉంచడమే కాకుండా, సకాలంలో సరఫరా కొనసాగించేందుకు జిల్లా యంత్రాగం కూడా తరచుగా జిల్లాకు యూరియా కేటాయింపుల కోసం వ్యవసాయ శాఖా డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని అన్నారు.
యూరియా పంపిణీ సంబంధిత అంశాలలో రైతులు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, జిల్లా యంత్రాగం, జిల్లా వ్యవసాయశాఖ యూరియా సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తోందని, ఎటువంటి సమస్యలు ఉన్నా, మీ మండల వ్యవసాయ అధికారి, వ్యవసాయ విస్తరణ అధికారి దృష్టికి తీసుకుని రావాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.