చర్చ, పెద్దపల్లి: విద్యార్థుల అభ్యున్నతికి చిత్తశుద్ధితో పని చేయాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
- అంగన్వాడి, మహిళ ఉపాధ్యాయులను సన్మానించిన కలెక్టర్
- ఘనంగా మహిళ దినోత్సవం వేడుకలు
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.
శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష కార్యక్రమాన్ని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి , జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, బాలికల విద్య కోసం సావిత్రిబాయి పూలే చాలా కృషి చేశారని, దేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళల విద్య కోసం ప్రత్యేకంగా పాఠశాలలు ప్రారంభించారని తెలిపారు.
సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో మనం ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థుల అభ్యున్నతి కోసం కృషి చేయాలని, విద్యార్థులలో విద్యా ప్రమాణాలు పెంచే దిశగా ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ సూచించారు.
అనంతరం ప్రభుత్వ పాఠశాలలోని మహిళ ఉపాధ్యాయులను, అంగన్వాడి ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ సత్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి
శారద, జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్ జిల్లా సమగ్ర శిక్ష సమన్వయకర్త మల్లేశం , సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.