
- గ్రామ స్థాయి నుండి మహిళా కాంగ్రెస్ ను బలోపేతం..
- సమావేశంలో మహిళా సాధికారతపై చర్చ..
- మహిళా స్థానాలలో కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారం
గ్రామ స్థాయి నుండి మహిళా కాంగ్రెస్ ను బలోపేతం చేయాలని, రాబోయే మునిసిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకురాలు కష్టపడాలని కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న రెడ్డి అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాయంలో జరిగిన సమీక్షా సమావేశంలో రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, మహిళా సాధికారత పై పార్టీ మహిళా నేతలతో చర్చించారు. కాంగ్రెస్ పార్టీ తరపున జిల్లాలో మహిళలు పోటీ చేస్తున్న స్థానాలలో ప్రచారం చేయాలని, కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికలలో కష్టపడ్డ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులకు టికెట్స్ ఇచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కరీంనగర్ జిల్లాలో నామినేటెడ్ పోస్టుల భర్తీలో కూడా మహిళా కాంగ్రెస్ లో మహిళలకు సముచిత స్థానం దక్కేలా ప్రయత్నిస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ ఇంచార్జ్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గాజుల సుకన్య, వంగల కళ్యాణి రెడ్డి, నగర అధ్యక్షురాలు వెన్నం రజిత రెడ్డి, మానకొండూర్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ ఇంచార్జ్ కవ్వ పద్మ, కరీంనగర్ నియోజకవర్గ మహిళ కాంగ్రెస్ ఇంచార్జ్ హసీనా, కరీంనగర్ జిల్లా మహిళా బ్లాక్, మండల, పట్టణ అధ్యక్షులు, కరీంనగర్ కార్పొరేషన్ డివిజన్ మహిళా అధ్యక్షులు, మహిళా నాయకులు పాల్గొన్నారు.