News & Views

చర్చ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ పాల్వంచ శ్రీ విజయ నర్సింగ్ హోమ్ ఆకస్మిక తనిఖీ

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం, భద్రాద్రి కొత్తగూడెం

చర్చ, భద్రాద్రి కొత్తగూడెం

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ గురువారం రోజు పాల్వంచలోని శ్రీ విజయ నర్సింగ్ హోమ్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
తనిఖీలో భాగంగా ఆయ‌న క్రింది సూచనలు చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందించే సేవల ప్రైస్ లిస్ట్ ను రిసెప్షన్ వద్ద స్పష్టంగా ప్రదర్శించాలి. ల్యాబ్‌లో నిర్వహించే రక్తపరీక్షల ధరల జాబితా కూడా రిసెప్షన్ వద్ద ఉంచాలి. ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ల పేర్లను కూడా స్పష్టంగా ప్రదర్శించాలి. వాడే వైల్స్ మూత తొలగించిన వెంటనే, వాటిపై తేదీ మరియు సమయం తప్పనిసరిగా నమోదు చేయాలి. కాన్పులు నిర్వహించే గదులను శుభ్రంగా ఉంచి, అవసరమైన మందులను తగిన విధంగా నిల్వ చేయాలి. ఆసుపత్రి నిర్వహణలో కనుగొన్న అసమానతలు మరల పునరావృతం కాకూడదని డాక్టర్ తుకారం రాథోడ్ హెచ్చరించారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో డి వై పిఎంఓ మోహన్ పాల్గొన్నారు.