News & Views

చర్చ, కమాన్‌పూర్: ఆదివరాహాస్వామిని దర్శించుకున్న జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ దొనికెన రవి

  • ముక్కోటి ఏకాదశి పర్వదినం ఉత్తర ద్వారా దర్శనం.

ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా కమాన్‌పూర్ మండల కేంద్రంలోని శ్రీ ఆది వరహాస్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది.ఈ విశేష పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ దొనికెన రవి కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకుని ఉత్తర ద్వారా దర్శనంతోపాటు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయానికి వచ్చిన అతిథులను టెంపుల్ ఈవోతో పాటు కమాన్‌పూర్ సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్ ఆత్మీయంగా స్వాగతించారు.ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా తీర్థ–ప్రసాదాలు అందజేసి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆశీర్వచనం చేశారు.