News & Views

చర్చ, జగిత్యాల: దొంగల మర్రి చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ గారు

 


చర్చ, జగిత్యాల జిల్లా

దొంగల మర్రి చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ గారు

సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, కొడిమ్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా బార్డర్ వద్ద ఏర్పాటు చేసిన దొంగల మర్రి చెక్‌పోస్ట్ ను ఎస్పీ ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రవర్తన నియమావళిని జిల్లాలో కట్టుదిట్టంగా అమలు చేస్తునామని, నగదు, మద్యం, ఉచిత పంపిణీలు, ఇతర ప్రలోభాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతున్నదని తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున పోలీసులు అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్‌ను కఠినంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు.“ఓటర్లను ప్రలోభ పెట్టే ఏ చర్యలకు కూడా ఎవరూ పాల్పడవద్దని ఎన్నికలకు సంబంధించి అక్రమంగా నగదు, మద్యం లేదా వస్తువులు తరలిస్తే, సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం అన్నారు . సరైన ఆధారాలు లేకుండా భారీ మొత్తంలో డబ్బులు తీసుకెళ్తే సీజ్ చేయడం జరుగుతుందని.అత్యవసర అవసరాలకు నగదు తీసుకెళ్తే తగిన బిల్లులు, పత్రాలు వెంట ఉంచుకోవాలని ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు.

చెక్‌పోస్ట్ వద్ద సిబ్బంది ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా, పకడ్బందీగా తనిఖీ చేయాలని, అప్రమత్తంగా వ్యవహరించాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు.

ఎస్పీ వెంట మల్యాల సీఐ రవి, ఎస్ఐ సందీప్ మరియు చెక్‌పోస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.