చర్చ, జగిత్యాల: పోలింగ్ సరళిని, భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ
పోలింగ్ సరళిని, భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ
మూడవ విడత సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నట్లుగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న ఇబ్రహీం నగర్, గొల్లపల్లి, బత్కపల్లి, నంచర్ల, గ్రామాల్లో గల పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పెట్రోలింగ్ వాహనాలు, ప్రత్యేక పోలీసు బృందాలు నిరంతరం పర్యటిస్తూ శాంతిభద్రతలను పర్యవేక్షిస్తారని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారులకు, సిబ్బందికి ఎస్పీ భద్రత పరమైన పలు సూచనలు చేశారు.