గోశాల ను సందర్శించి ఆర్ధిక సహాయం అందించిన మద్దిశెట్టి….
గోశాలను గోరక్ష దళ్ నేషనల్ ఇన్చార్జ్ మద్దిశెట్టి సామేలు సందర్శించారు..

గోశాల ను సందర్శించి ఆర్ధిక సహాయం అందించిన మద్దిశెట్టి….
చర్చ, సత్తుపల్లి:
భారతీయ యువ సేవ సంఘ్ గో రక్ష దళ్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని పెద్ద వంతెన దగ్గర బ్రహ్మశ్రీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీదేవి శ్రీ విద్యాపీఠం, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం, శ్రీ రాజశ్యామలాసహిత దశమహావిద్య స్వర్ణ దేవాలయ నిర్మాణ సంకల్పకర్త — గత 25 సంవత్సరాలుగా పూజారిగా, అర్చకులుగా సేవలందిస్తూ గోశాలను నడుపుతున్నారు.ప్రస్తుతం సత్తుపల్లి గోశాలలో సుమారు 70 గోమాతలు ఉన్నాయి. గత నాలుగు రోజులుగా ఆ గోమాతలకు ఆహారం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమాచారం రావడంతో, వాట్సాప్ ద్వారా తెలుసుకున్న తరువాత ఈరోజు ఉదయం నేను స్వయంగా గోశాలను సందర్శించి నా వంతుగా ఆర్థిక సహాయం అందజేశాను అనిమద్దిశెట్టి సామెలు తెలియజేశారు.ప్రతి ఒక్కరు కూడా ఈ పవిత్ర గోశాలను సందర్శించి, గోమాతను రాష్ట్రమాతగా భావించి, ఆహారం అందించే కార్యక్రమంలో మన వంతుగా సాయం చేయాలని మనస్పూర్తిగా కోరుతున్నాను.
గోమాత రక్షణ మన అందరి బాధ్యత — మనం చేతులు కలిపితేనే సంస్కృతి నిలుస్తుంది.
ఈ కార్యక్రమంలో పలగాని శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నరు