చర్చ, జగిత్యాల : షర్మిల మేకప్ స్టూడియోను ప్రారంభించిన డా. శ్రావణి
షర్మిల మేకప్ స్టూడియోను ప్రారంభించిన డా. శ్రావణి
జగిత్యాల లో నూతనంగా ఏర్పాటు చేసిన షర్మిల మేకప్ స్టూడియో, అకాడమీని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, ఎమ్మెల్యే కాంటెస్ట్ అభ్యర్థి బోగ శ్రావణి ప్రారంభించారు. స్థానిక పాత బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన స్టూడియో ను ప్రారంభం చేసిన డా. శ్రావణి నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం లో జగిత్యాల పట్టణ బిజెపి అధ్యక్షులు కొక్కు గంగాధర్, దూరిశెట్టి మమత, సింగం పద్మ, కవిత, కొప్పు భాస్కర్, మహేష్, గోపి తదితరులున్నారు.