News & Views

చర్చ, జగిత్యాల: జగిత్యాల జిల్లా నూతన వైద్యాధికారిగా డాక్టర్ సుజాత

జగిత్యాల జిల్లా నూతన వైద్య, ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ సుజాత బాధ్యతలు చేపట్టారు. వైద్య సిబ్బంది నూతన డిఎంహెచ్వో గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ సుజాత కు పుష్పగుచ్చాన్నీ అందజేసి అభినందనలు తెలియజేశారు. ఇటీవల గుండెపోటుతో హఠాన్మరణం చెందిన డాక్టర్ ఆకుల శ్రీనివాస్ చిత్ర పటానికి శ్రద్ధాంజలి ఘటిస్తూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుజాత మాట్లాడుతూ వైద్య సిబ్బంది మెరుగైన సేవలు అందించి జిల్లాను ప్రగతి పథంలో నడిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్, ఆఫీస్ సూపర్టెండెంట్ నర్సింగరాజ్, ఏ ఏం ఓ సత్యనారాయణ, ఎన్ హెచ్ ఎం ,డి పి ఓ రవీందర్, హెచ్ ఈ ఓ లు రాం కుమార్, శ్రీధర్, రాజేశం, హెల్త్ ఎడ్యుకేటర్స్ కటకం భూమేశ్వర్, తరాల శంకర్, సూపర్వైజర్లు శ్రీనివాస్, శ్యామ్, కుతుబుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.