చర్చ: రామగిరి: కృష్ణవేణి విద్యా సంస్థలలో ముందస్తు ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు
స్థానిక కృష్ణవేణి టాలెంట్ స్కూల్, హిల్-పోర్ట్ హై స్కూల్, సాయి ప్రగతి విద్యానికేతన్ పాఠశాలల్లో ముందస్తు ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు కరస్పాండెంట్ చందుపట్ల తిరుపతి రెడ్డి, ప్రిన్సిపాల్ బర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు అందరూ సాంప్రదాయ దుస్తులలో వచ్చి తమ ఆట పాటలు మరియు నృత్యాల ద్వారా 2025 సంవత్సరంలో జరిగిన మధుర స్మృతులను తలచుకుంటూ, ఆ సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ, 2026 నూతన ఆంగ్ల సంవత్సరమునకు స్వాగతం పలికారు.