చర్చ, సత్తుపల్లి, కారు ప్రమాదంలో వృద్ధురాలు మృతి

కారు ప్రమాదంలో వృదురాలు మృతి చెందిన సంఘటన సత్తుపల్లి లో చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఎన్టీఆర్ జిల్లా చనుబండ గ్రామానికి చెందిన షేక్ షకీనా ఆదివారం తన మనవరాలు సత్తుపల్లి వెంగళరావునగర్ రోడ్ లో నివాసముంటున్న షేక్ మదర్ బి చూసి పోదామని వచ్చిందని, అయితే అదే రోడ్లో సోమవారం రాత్రి కారు వెనుకకు టర్న్ చేసే క్రమంలో కారు గేటు దిమ్మను ఢీకొంది. దీంతో దిమ్మ వెనుక షకీన బి కూర్చుని ఉండడంతో దిమ్మ ఆమె మీద పడిందని ఇది గమనించిన స్థానికులు మెరుగైన వైద్యం కోసం విజయవాడ తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మరణించినట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినట్లు తెలిపారు.