News & Views

చర్చ, జగిత్యాల: రైతులకు నష్టం జరగకుండా చూడండి

 

  • ఆర్. డి. వో. ను కోరిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్

కల్లెడ గ్రామ రైతులకు సంబంధించిన భూములు నేషనల్ హైవే 63 విస్తరణ లో కోల్పోతున్న సందర్భంగా కబ్జాలో ఉన్న రైతులు పేర్లు రాకుండా ఓనర్ నాట్ ఐడెంటిఫైడ్ అని రావడంతో అక్కడి రైతులకు అన్యాయం జరిగుతోందని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు.
బుధవారం కల్లెడ గ్రామ రైతులు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలవగా స్పందించిన ఎమ్మెల్యే కల్లెడ గ్రామ రైతులతో కలిసి ఆర్డిఓ మధుసూదన్ ను తన కార్యాలయంలో కలిసి కల్లెడ గ్రామ రైతులకు నేషనల్ హైవే 63లో భూములు కోల్పోతున్న సందర్భంగా ఓనర్ నాట్ ఐడెంటిఫైడ్ అని వచ్చిన వాటికి తిరిగి రీ సర్వే నిర్వహించి అర్హులైన భూమి కోల్పోతున్న రైతులకు సరైన నష్టపరిహారం చెల్లించే విధంగా చొరవ తీసుకోవాలని రైతులకు న్యాయం జరిగేలా చూడాలని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కోరారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ పరశురామ్ గౌడ్, సీనియర్ నాయకులు మహేశ్వర్ రావు, మాజీ సర్పంచ్ మహేశ్వర్ రావు, నాయకులు హరి కిషన్ రావు, రాజన్న, రైతులు తదితరులు పాల్గొన్నారు.