చర్చ,గోదావరిఖని :అలరించిన వెల్ బేబి షో పోటీలు..
అలరించిన వెల్ బేబి షో పోటీలు
సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా గోదావరిఖని సింగరేణి ఏరియా హాస్పటల్ లో వెల్ బేబీ షో పోటీలు నిర్వహించారు. ఈ పోటిల్లో ఆర్జీ వన్ ఉద్యోగుల కుటుంబీకుల చిన్నారులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ఆర్జీ వన్ సేవా అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్,ఏరియా హాస్పిటల్ ఎసిఎంఓ డా.అంబిక ముఖ్య అతిదిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ పోటీలలో మొదటి సంవత్సరం నుండి ఐదు సంవత్సరాల వయస్సు గల చిన్నారులు పాల్గొన్నారు. పోటీల ఎంపికలో పిల్లల వయస్సు , బరువు, ఎత్తు ఆకర్షనీయమైన వస్త్రదారణ, అందమైన ముఖ వర్చస్సు, పిల్లల బుడి బుడి అడుగుల సవ్వడి పరిగణలోకి తీసుకొని ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. బేబి కింగ్, బేబి క్వీన్, ప్రిన్స్, ప్రిన్సెస్ పోటీలను నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఎంపికైన చిన్నారులకు సింగరేణి ఆవిర్భావ ప్రధాన వేడుకలో బహుమతుల ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమములో డా శ్రీనివాస్, డా మద్దిలేటి, డా. పద్మ, సేవా సెక్రటరి బీనా సింగ్, సేవా జాయింట్ సెక్రటరీ రజిత, లేడీస్ క్లబ్ సెక్రటరీ శిరీష, సంక్షేమ అధికారి శ్రీనివాస్, మాట్రీన్ నిర్మల పాల్గొన్నారు.