చర్చ. ములుగు: నిర్లక్ష్యానికి కేరాఫ్ అడ్రస్ ఏటూరునాగారం ఎమ్మార్వో కార్యాలయం
సామాన్యులకు సర్టిఫికెట్ అందాలంటే ఆ అధికారికి "చందా" చెల్లించాల్సిందే

నిర్లక్ష్యానికి కేరాఫ్ అడ్రస్ ఏటూరునాగారం ఎమ్మార్వో కార్యాలయం
సామాన్యులకు సర్టిఫికెట్ అందాలంటే ఆ అధికారికి “చందా”
చెల్లించాల్సిందే ?
చర్చ, ములుగు జిల్లా బ్యూరో ఏటూరు నాగారం , నవంబర్ 22:
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని ఎమ్మార్వో కార్యాలయంలో కులము, మరియు నివాసము ఆదాయం విద్య ఉద్యోగ అవసరాల కొరకై అర్జీలు పెట్టుకుంటే రోజులు తరబడి తిప్పిస్తూన్నారని మండలం లోని ప్రజలు వాపోతున్నారు.
ఆఫీసులోని ఓ అధికారి ఒక్కొక్క సర్టిఫికెట్ కు 300 నుండి 500 రూపాయలు దండుకుంటున్నట్టు తెలుస్తుంది.
రేషన్ కార్డు యాడ్ మరియు కొత్తది అప్లికేషన్ చేసుకున్న నెలలు గడుస్తున్నా కూడా కావాలనే కాలయాపన చేస్తు రేపు, మాపు మీటింగ్ లో ఉన్నాం అంటూ ఎమ్మార్వో మరియు కార్యాలయం సిబ్బంది సర్టిఫికెట్లు ఇచ్చినా కూడా డబ్బాలో వేసి వెళ్ళండి. అని చెప్తూ కాలం వెల్లదిస్తున్నారు అప్లికేషన్ చేసి సపోర్ట్ డాక్యుమెంట్ లు ఆఫీసులో ఒక డబ్బాలో వేయమంటున్నారు నెలలు కడుస్తున్న సర్టిఫికెట్లు రాకపోయే సరికి ఎమ్మార్వో ఆఫీస్ లో అడగగా మళ్లీ సర్టిఫికెట్టు డాక్యుమెంట్ జిరాక్స్ తీసుకొని రావాలి అని అంటున్నారు విద్యార్థులు మరియు రేషన్ కార్డుదారులు అప్లికేషన్ చేసి నెలలు గడుస్తున్నా కూడా అందని సర్టిఫికెట్ లు
దరఖాస్తు చేసుకుంటే, చిన్న చిన్న లోపాలు సాకుగా చూపి, రోజుల తరబడి తిప్పుకుంటున్నారని మండల ప్రజలు వాపోతున్నారు దీని పై ములుగు జిల్లా కలెక్టర్ స్పందించి ఈ సర్టిఫికెట్ల జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.