చర్చ. హుస్నాబాద్ : ప్రభుత్వ డిగ్రీ విద్యార్థుల క్షేత్ర పర్యటన

సిద్దిపేట జిల్లా
చర్చ:- హుస్నాబాద్: పట్టణంలో గురువారం రోజు
ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులు మరియు అధ్యాపకులు కలిసి హుస్నాబాద్ లోని గోమాత జిన్నింగ్ మరియు ప్రెస్సింగ్ కాటన్ మిల్లును సందర్శించడం జరిగింది. ఈ సందర్శనలో భాగంగా రైతులు సేకరించిన పత్తిని ఏ విధంగా మిల్లులో శుభ్రం చేసి పత్తి గింజలను వేరు చేసి తెల్లని పత్తిని మిల్లులోని వివిధ యంత్రాల ద్వారా పంపించి ప్రెస్సింగ్ ద్వారా సుమారుగా 150 నుంచి 200 కేజీల బరువు ఉండే కట్టలుగా (బ్లేల్లూగా) చేసి లారీలలో స్పిన్నింగ్ అండ్ త్రెడ్డింగ్ క్లాత్ కాటన్ మిల్లులకు పంపించడం జరుగుతుందని, మిగిలిన పత్తి గింజలను బస్తాలలో నింపి నూనె తీసే మిల్లుకు పంపించడం జరుగుతుందని నేర్చుకున్నారు. మిగిలిపోయిన నాసిరకం పత్తిని స్థానికంగా తయారు చేసే పరుపులలో వాడుతారని, కాటన్ మిల్లు నుంచి వచ్చే సన్నని మెత్తని పత్తిని ప్రత్యేకంగా ప్యాక్ చేసి సిగరెట్ పీకలలో చివరగా వాడే కాటన్ ఫిల్టర్ లాగా వాడుతారని అక్కడి యాజమాన్యం తెలిపారు. క్షేత్ర పర్యటనను ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ విజయగిరి బిక్షపతి మాట్లాడుతూ విద్యార్థులను మరియు అధ్యాపక బృందాన్ని అభినందించారు ఇలాంటి మరెన్నో క్షేత్ర పర్యటనల ద్వారా విద్యార్థులు విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ క్షేత్ర పర్యటనలో డాక్టర్ బాలరాజు అసోసియేట్ ప్రొఫెసర్ బాటని, డాక్టర్ అనిల్ కుమార్ అసోసియేట్ ప్రొఫెసర్ జువాలజీ, డాక్టర్ ఇందిరా నాయనా దేవి అసోసియేట్ ప్రొఫెసర్ ఎకనామిక్స్, రాజ్యలక్ష్మి ఆ సిస్టం ప్రొఫెసర్ ఫిజిక్స్, లక్ష్మి మ్యాథమెటిక్స్ లెక్చరర్ పాల్గొన్నారు