చర్చ, మణుగూరు : గ్రిల్ నైట్స్ రెస్టారెంట్ లో మంటలు అర్ధరాత్రి దగ్ధమైన రెస్టారెంట్ సుమారుగా 7 లక్షల ఆస్తి నష్టం

గ్రిల్ నైట్స్ రెస్టారెంట్ లో మంటలు
అర్ధరాత్రి దగ్ధమైన రెస్టారెంట్
సుమారుగా 7 లక్షల ఆస్తి నష్టం
మణుగూరు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం అశోక్ నగర్ తెలుగుదేశం సెంటర్ లో గ్రిల్ నైట్స్ రెస్టారెంట్ ఫిబ్రవరి 27 అర్ధరాత్రి మంటలు రావడంతో, సమీపంలో ఉన్న హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ సెక్యూరిటీ గార్డ్ అప్రమత్తమై లోపల ఉన్న వర్కర్లను లేపడంతో వర్కర్ల ప్రాణాలు రక్షించడం జరిగిందని విశ్వసనీయ సమాచారం అర్ధరాత్రి ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇవ్వడం ,ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకునే సమయానికల్లా,చుట్టుపక్కల వాళ్ళు నీళ్లతో మంటలను అదుపు చేసినట్లు సమాచారం రెస్టారెంట్ నడుపుతున్న యజమానికి, సుమారు 7 లక్షల వరకు నష్టం జరిగిందని రెస్టారెంట్ నిర్వాహకుడు వాపోయాడు సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది, ఎలక్ట్రిసిటీ సిబ్బంది రెస్టారెంట్ ను నిశితంగా పరిశీలించి, ఫైర్ సేఫ్టీ లేకపోయినా షార్ట్ సర్క్యూట్ అయినా రెస్టారెంట్ పూర్తిగా 100% కాలిపోయేదని తెలుపుతున్నారు పెప్సీ ఫ్రిడ్జ్ కంప్రెసర్ వల్ల ఈ సంఘటన జరిగి ఉండవచ్చని , లేదా షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగి ఉండవచ్చునని స్థానికులు అనుకుంటున్నారు ఏది ఏమైనా , దేనివల్ల ఈ సంఘటన జరిగిన,అద్దె పద్ధతిన రెస్టారెంట్ నడుపుతున్న వారికి సుమారు 7 లక్షల ఆస్తి నష్టం జరిగి ఉందని రెస్టారెంట్ నిర్వాహకులు ,స్థానికులు అనుకుంటున్నారు సంబదిత అధికారులు నష్టపోయిన రెస్టారెంట్ నడుపుతున్న వారిని ,ఆదుకోవాలని స్థానికులు, నిర్వాహకులు వాపోతున్నారు ఈ సంఘటనపై స్థానిక పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, అధికారులు ,దేని లోపం వల్ల ఈ సంఘటన జరిగిందో ? తేల్చాల్సిన అవసరం ఎంతో ఉంది రెస్టారెంట్ నిర్వాహకుల ఆస్తి నష్టాన్ని అంచనావేసి సంబంధిత అధికారులు ఆదుకోవాలని నిర్వాహకులు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు