చర్చ బెల్లంపల్లి : బెల్లంపల్లి సమీకృత బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ – 40 మందికి పైగా విద్యార్థినులు అస్వస్థత
పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య

చర్చ బెల్లంపల్లి :
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సమీకృత బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజనింగ్ ఘటన కలకలం రేపింది. గురువారం రాత్రి భోజనం చేసిన అనంతరం 40 మందికి పైగా బాలికలు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థినులకు వాంతులు, విరేచనాలు రావడంతో పాటు కొంతమంది బాలికలు స్పృహ కోల్పోయిన పరిస్థితి నెలకొంది. రాత్రి వండిన మిల్ మేకర్ కూరలో పురుగులు ఉన్నాయని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు.ఈ విషయం వార్డెన్‌కు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదని బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి తీవ్రతరం కావడంతో స్థానికులు స్పందించి తమ సొంత వాహనాల్లో బాధిత విద్యార్థినులను బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
చివరి నిమిషంలో హాస్టల్‌కు ప్రైవేట్ ఆర్‌ఎంపీ డాక్టర్‌ను తీసుకువచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో బాధిత విద్యార్థినులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పలువురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.ఘటనపై విద్యార్థి సంఘాలు ఆరా తీశాయి. అలాగే మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని బాధిత విద్యార్థినులను పరామర్శించారు. వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించడంలో అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని ఆయన ఆరోపించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్