News & Views

చర్చ,గోదావరిఖని : ఒక్క అవకాశం ఇవ్వండి..

పదవి కోసం కాదు డివిజన్ అభివృద్ధి కోసం వస్తున్నా..

చర్చ,గోదావరిఖని:

ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్న 37వ డివిజన్ స్వతంత్ర అభ్యర్థి

సలిగొమ్ముల ఉమారాణి.

గతంలో రెండు సార్లు ప్రజలు ఆశీర్వదించిన స్వల్ప తేడాతో ఓడిపోయానని ఈ సారి తప్పకుండా గెలిపించాలని కోరుతూ గడప గడపకు ప్రచారం నిర్వహిస్తున్నారు. నిత్యం ప్రజలతోనే ఉంటూ డివిజన్ అభివృద్దికి కృషి చేస్తానని ఉమారాణి పేర్కొన్నారు. మీ ఇంటి ఆడబిడ్డగా ఆశీర్వదించి ఈసారి తప్పకుండా ఆదరించాలని కోరారు. తనకు డివిజన్ ప్రజలు కుటుంబంలాంటివారని,మీ అడ బిడ్డగా కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉంటానని 37 వ డివిజన్ అభివృద్దికి అహర్నిషలు కృషి చేస్తానని తెలిపారు. డివిజన్లో తాగునీటి సమస్యలు, డ్రైనేజీ, రోడ్ల అభివృద్ధి, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. అలాగే మహిళలు, యువతకు అవకాశాలు కల్పించడం, ప్రజా సమస్యలపై తక్షణం స్పందిస్తానని అన్నారు. డివిజన్లో ఏ సమస్య తలెత్తినా ప్రజల దగ్గరకే వెళ్లి సమస్యను పరిష్కారం చూపే విధంగా పనిచేస్తానని అన్నారు.బ్యాట్ గుర్తు పై ఓటు వేసి బారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు