చర్చ,గోదావరిఖని: గోదావరిఖని రజక సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
- అధ్యక్షులుగా బండి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి రాగుల రవిందర్, కోశాధికారి వడ్లూరి దేవయ్య
రామగుండం కార్పొరేషన్ గోదావరిఖని రజక సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని సోమవారం తిలక్‌నగర్‌లోని విశ్వం ఫంక్షన్ హాల్లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గోదావరిఖని రజక సంక్షేమ సంఘంఅధ్యక్షులు బండి లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి రాగుల రవిందర్,కార్యనిర్వహణ అధ్యక్షులు , కోశాధికారి వడ్లూరి దేవయ్య, సలహాదారులుగా ములుకుంట్ల రాజేశం, దామనపల్లి రాజేశం, ఉపాధ్యక్షులు పైడి రాజయ్య ,ముక్కెర శ్రీనివాస్, తిరుపతి,సహాయ కార్యదర్శి ఎలబోతారం సదానందం,ప్రధాన ప్రచార కార్యదర్శి బిజ్జిగిరి వెంకటరాజం,ప్రచార కార్యదర్శి మామిడి మహేందర్, కార్యవర్గ సభ్యులు తోటపల్లి శ్రీనివాస్,పసునూటి రాజేందర్,నగునూరి రాజేశం, పైతరి సురేష్, బస్తీ పెద్దమనుషులు కొల్లూరి గోపాల్, నడిగొట్టు పోశం,సూరి శంకర్,కంచర్ల సారయ్య, పోలంపల్లి సారయ్య,గుండ్రాతి నారాయణ,కాసర్ల సురేష్,పైండ్ల భిక్షపతి తదితరులను ఎన్నుకున్నారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ రజక సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేస్తామని రజకుల హక్కుల కోసం కృషి చేస్తామని అన్నారు.