చర్చ, సింగరేణి : సేవ్ సింగరేణి పేరిట గోలేటి టు కొత్తగూడెం బస్ జాతా ప్రారంభం


*సేవ్ సింగరేణి పేరిట గోలేటి టు కొత్తగూడెం బస్ జాతా ప్రారంభం.*
*అన్ని మైన్స్ మరియు డిపార్ట్మెంట్స్ లలో నల్ల బడ్జిలతో నిరసన తెలిపి మెమొరాండం అందచేసిన గుర్తింపు సంఘం ఎఐటియుసి నాయకులు*
చర్చ,సింగరేణి, కొత్తగూడెం
సింగరేణి లో కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా యాజమాన్యం కాలయాపన చేస్తుందని గుర్తింపు సంఘం ఏఐటియుసి ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. మంగళవారం ఉదయం కొత్తగూడెం ఏరియాలో అన్ని మైన్స్ మరియు డిపార్ట్మెంట్స్ నందు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపి మెమొరాండం అందచేశారు.సింగరేణి యాజమాన్యం కొన్ని సమస్యల ను స్ట్రక్చర్ కమిటీ సమావేశాల్లో అంగీకరించి ఇంత వరకు వాటిపై అమలు కోసం యాజమాన్యం సర్క్యులర్ లు జారీ చేయలేదని ఎఐటియుసి నాయకులు పేర్కొన్నారు. ముఖ్యంగా మారుపేర్లు విజిలెన్స్ కేసుల సమస్య, సొంత ఇంటి పథకం, పెర్క్స్ పై ఇన్ కం టాక్స్ సమస్య, డిస్మిస్ కార్మికుల కు ఒక అవకాశం కల్పించాలని కోరారు. సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తుందని కనుక భవిష్యత్తు కార్యాచరణ వాల్ పోస్టర్ ను విడుదల చేశారు, ఏఐటియుసి ఈ నెల 18 నుండి 30 వరకు గోలేటి టూ కొత్తగూడెం బస్ జాతా ప్రారంభం కానుందని,30న సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించునున్నాం అని ఎఐటియుసి నాయకులు తెలిపారు,సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను మరియు ఏప్రిల్ లో జరగబోయే సమ్మె విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు, జరగబోయే ఆందోళన కార్యక్రమంలో కార్మికులు అధికసంఖ్యలో పాల్గొని సింగరేణి సంస్థ మనుగడను కాపాడాలని ఎఐటియుసి నాయకులు కోరారు, ఈ కార్యక్రమంలో,బ్రాంచ్ కార్యదర్శి,మల్లికార్జున్ రావు,కేంద్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వీరస్వామి,వైస్ ప్రెసిడెంట్ కత్తెర్ల రాములు,సహాయ కార్యదర్శి,గట్టయ్య, ఆఫీస్ బ్యారర్స్ సందబోయిన శ్రీనివాస్, ఎస్ నాగేశ్వరరావు, హుమాయూన్,హీరాలాల్, మెంగెన్ రవి,గుమ్మడి వీరయ్య,కర్రు రమేష్,పిట్ కార్యదర్శిలు భూక్యా రమేష్,మధుకృష్ణ,కమల్, ఏం ఆర్ కే ప్రసాద్,సౌజన్య, ఎఐటియుసి నాయకులు సాయి పవన్, సందీప్, దేవసింగ్, సురేందర్ ,మురళి,రాజులపూడిసాంబమూర్తి, వినయ్, అవినాష్,సైదులు,రమేష్,అది రాజేందర్,అప్పారావు, కరుణాకర్,తదితరులు పాల్గొన్నారు.