చర్చ,గోదావరిఖని:గౌడ్ అఫీషియల్స్, ప్రొఫెషనల్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక…
చర్చ,గోదావరిఖని:
గోపా నూతన కమిటీ ఎన్నిక…
గౌడ్ అఫీషియల్స్, ప్రొఫెషనల్స్ అసోసియేషన్ పెద్దపెల్లి జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం ఎన్టిపిసి విశ్వభారతి హై స్కూల్ ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో పెద్దపెల్లి జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మండల రమేష్ గౌడ్ ,ప్రధాన కార్యదర్శిగా బంధారపు యాదగిరి గౌడ్, కోశాధికారిగా కుక్కేస రవీందర్ గౌడ్ ఎన్నికయ్యారు. వీరితో పాటు ఉపాధ్యక్షులుగా వీరగోని శ్రీనివాస్ గౌడ్ ,అడ్డగుంట రాజేందర్ గౌడ్ ,బాలసాని స్వామి గౌడ్, మేడగోని రాజమౌళి గౌడ్, గాదర్ల కొమురయ్య గౌడ్, పెరుమాళ్ళ శ్రీనివాస్ గౌడ్ ఎన్నికయ్యారు. కార్యనిర్వాహక కార్యదర్శిగా మాచిడి మహేందర్ గౌడ్, ముక్క రాజయ్య గౌడ్, దాసరి రఘు గౌడ్ శ్రీనివాస్ గౌడ్, మోత్కూరి నారాయణ గౌడ్, చిరంజీవి గౌడ్, సురేందర్ గౌడ్ ఆరెల్లి కుమార్ గౌడ్ ,పరకాల దేవేందర్ గౌడ్, మల్యాల కరుణాకర్ గౌడ్ ,చిప్యాల రమ్యకృష్ణ గౌడ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గానికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు