News & Views

చర్చ, జగిత్యాల: కొండగట్టు అగ్ని ప్రమాద భాదితులకు ప్రభుత్వ పరంగా సహాయం – జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్!

అగ్ని ప్రమాద భాదితులకు ప్రభుత్వ పరంగా సహాయం – జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్!

చర్చ, జగిత్యాల : శనివారం రాత్రి కొండగట్టు లో జరిగిన అగ్ని ప్రమాద సంఘటనలో నష్ట పోయిన భాదితులకు ప్రభుత్వ పరంగా సహాయం అందిస్తామని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ పేర్కొన్నారు. కొండ గట్టులో అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే సంబంధిత అధికారులను, అగ్నిమాపక విభాగాన్ని అలర్ట్ చేయడం తో పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. భాదితులకు స్థానిక పాఠశాల లో తాత్కాలిక నివాసం కల్పించి అన్ని రకాల సహాయ ఏర్పాట్లు చేశామన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సహాయ చర్యలు చేపట్టాలని కోరారన్నారు. నష్ట అంచనా రాగానే ప్రభుత్వానికి నివేదించి సహాయం అందిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.