News & Views

చర్చ, కొత్తగూడెం: ప్రభుత్వ పాలిటెక్నిక్, కొత్తగూడెం జిల్లా స్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ క్రీడలు మరియు ఆటల నిర్వహణ సమాచారం

గవర్నమెంట్ పాలిటెక్నిక్, కొత్తగూడెం ప్రిన్సిపాల్ మరియు ఉమ్మడి జిల్లాల కోఆర్డినేటర్ శ్రీ బండి శ్రీనివాస్ తెలియజేసిన సమాచారం ప్రకారం, జిల్లా స్థాయి ఇంటర్ పాలిటెక్నిక్ క్రీడలు మరియు ఆటలు (District Level Inter Polytechnic Sports and Games Meet – DLIPSGM 2025-26)
డిసెంబర్ 19 మరియు 20 తేదీలలో గవర్నమెంట్ పాలిటెక్నిక్, కొత్తగూడెం ప్రాంగణంలో నిర్వహించబడనున్నాయి.
ఈ క్రీడా పోటీలలో జిల్లా పరిధిలోని వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన విద్యార్థులు (8 కళాశాలలు, 210 మంది విద్యార్థులు పాల్గొని తమ క్రీడా నైపుణ్యాలు, జట్టు సమన్వయం మరియు క్రీడాస్పూర్తిని ప్రదర్శించనున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులలో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, స్నేహభావం మరియు ఆరోగ్యకరమైన పోటీ తత్వం పెంపొందించబడుతుందని తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమం 2025 డిసెంబర్ 19న ఉదయం 9:30 గంటలకు నిర్వహించబడనుండగా,
విశిష్ట అతిథులు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. రెండు రోజుల పాటు వివిధ జట్టు మరియు వ్యక్తిగత క్రీడా ఈవెంట్లు నిర్వహించబడతాయి. పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు మరియు ప్రశంసా పత్రాలను 2025 డిసెంబర్ 20న జరిగే ముగింపు కార్యక్రమంలో విశిష్ట అతిథుల చేతుల మీదుగా అందజేయనున్నట్లు
గవర్నమెంట్ పాలిటెక్నిక్, కొత్తగూడెం ప్రిన్సిపాల్ శ్రీ బండి శ్రీనివాస్ తెలిపారు.