చర్చ, రామగిరి: పంచాయితీ పాలకవర్గాన్ని సన్మానించిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు
రామగిరి మండలం రత్నాపూర్ గ్రామ పంచాయితీ నూతన పాలకవర్గాన్ని సోమవారం స్థానిక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. పాఠశాల హెచ్ఏం.బుర్రి శ్యామ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొదట సర్పంచ్ పల్లె ప్రతిమపివీరావు, ఉప సర్పంచ్ భాద్రపు ప్రవలిక ప్రశాంత్ లను శాలువాలతో సన్మానించారు. పాఠశాల అభివృద్ధికి తన వంతుగా సహకరిస్తానని సర్పంచ్ పల్లె ప్రతిమపివీరావు హామీ ఇచ్చారు. సెక్రటరీ గంగుల సంతోష్, వార్డ్ సభ్యులు పబ్బా స్రవంతి వెంకటేష్, కెక్కర్ల ఉష అశోక్, జక్కుల పద్మ చందన్, కలవేన రవి, ఖండే లక్ష్మీ గట్టయ్య, ఖండే.సాహితీ పోశం, బత్తిని ప్రశాంత్, అల్లి రమేష్, పున్నo మణి తేజ, జుట్టు యశోద సత్యనారాయణ, బత్తుల రాజమణి రమేష్ లను ఉపాధ్యాయులు ఘనంగా సన్మానించారు. అదే విధంగా మధ్యాహ్నం వంట భోజన నిర్వాహుకులు, ప్రైవేట్ ఉద్యోగులు సర్పంచ్ పల్లె ప్రతిమపివీరావు ను సన్మానించారు.