చర్చ, సత్తుపల్లి: మంత్రి తుమ్మల పుట్టినరోజు వేడుకలు…
మంత్రి తుమ్మల పుట్టినరోజు వేడుకలు...

మంత్రి తుమ్మల పుట్టినరోజు వేడుకలు…
చర్చ, సత్తుపల్లి:
సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి , రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరావు పుట్టినరోజు వేడుకలు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మధ్య ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రి లో రోగులకు పండ్లు, బ్రేడ్ లు అందించారు. ఈ కార్యక్రమం లో సత్తుపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు, సత్తుపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివా వేణు, సీనియర్ నాయకులు చలసాని సాంబశివరావు, దొడ్డా శ్రీను, చల్లగుళ్ల కృష్ణయ్య, సత్తుపల్లి మాజీ వైస్ చైర్మన్ సుజలా రాణి, మాజీ కౌన్సిలర్స్,సత్తుపల్లి నియోజకవర్గం, సత్తుపల్లి పట్టణం, మండలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా, తుమ్మల అభిమానులు, యూత్, ఎన్ ఎస్ యు ఐ నాయకులు పాల్గొన్నారు.