చర్చ హైదరాబాద్ : గుండె పోటును ముందే పసిగట్టే సాధనం

చర్చ హైదరాబాద్ : హృద్రోగ సంబంధ అత్యవసర పరిస్థితిని ముందే పసిగట్టి హెచ్చరిక జారీ చేసే ఒక వినూత్న సాధనాన్ని దేబాశ్రితా దాస్ అనే విద్యార్థిని రూపొందించారు. ఆమె ఇక్కడి రావెన్ షా విశ్వవిద్యాలయంలో ఐటీ విభాగంలో మూడో సంవత్సరం చదువుతున్నారు. కృత్రిమ మేధ సాయంతో పనిచేసే ఈ హృదయ రక్షక సాధనం ఒక మాస్క్‌లా ఉంటుందని, ఇది గుండె పోటు రావడానికి 30 నిమిషాల ముందే రోగిని అప్రమత్తం చేస్తుందని దేబాశ్రిత విశదీకరించారు.