News & Views

చర్చ, కమాన్‌పూర్‌: దహన సంస్కారానికి పెద్ద దిక్కుగా హెల్పింగ్ హ్యాండ్స్

కమాన్ పూర్ మండలంలోని
గుండారం గ్రామానికి చెందిన గౌడ సంఘం పెద్దమనిషి వడ్లకొండ పెద్ద మల్లయ్య గౌడ్ మృతి, పేద కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. 29-12-2025 రాత్రి 10 గంటల 30 నిమిషాలకు ఆయన కన్నుమూయగా, తీవ్ర పేదరికం కారణంగా చివరి దహన సంస్కారాలకు కూడా అవసరమైన ఆర్థిక సాయం లేక కుటుంబం దిక్కుతోచని స్థితిలో నిలిచింది.
ఈ విషయం తెలుసుకున్న కమాన్ పూర్ హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడు నారగోని సతీష్ గౌడ్ వెంటనే స్పందించి మానవత్వాన్ని చాటారు. దహన సంస్కారాల నిర్వహణ కోసం రూ.20,000 నగదు సాయం అందించడమే కాకుండా, రైస్ బ్యాగులు, నిత్యావసర సరుకులు అందించి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. ఇకపై కూడా కుటుంబానికి అవసరమైన సహాయం అందిస్తామని హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధులు భరోసా ఇచ్చారు.
ఈ సహాయక కార్యక్రమంలో గీసగోని శ్రీనివాస్, గరిగంటి విష్ణు, మచ్చ గణేష్, వడ్లకొండ అభిరామ్, వడ్లకొండ శంకర్‌తో పాటు హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు పాల్గొన్నారు.