News & Views

చర్చ,గోదావరిఖని: మరణించిన ఆయన కళ్ళు సజీవం

  • తండ్రి మరణంలోనూ మానవత్వాన్ని చాటిన గోదావరిఖని జర్నలిస్టు సోదరులు..

మరణించిన ఆయన కళ్లు ఈ లోకాన్ని చూస్తున్నాయి.గోదావరిఖని పరుశరాం నగర్ కు చెందిన సింగరేణి రిటైర్డ్ కార్మికుడు మామిడి రాయలింగు(72)అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం మృతిచెందాడు. తండ్రిని కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న సమాజ హితం కోసం ఆలోచించి అతని నేత్రాలను దానం చేయడానికి జర్నలిస్టులైన వారి కుమారులు మామిడి కుమారస్వామి, సత్యనారాయణ మరియు కుటుంబసభ్యులు అంగీకరించారు. సదాశయ ఫౌండేషన్, రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో తమ తండ్రి రాయలింగు నేత్రాలను మంగళవారం దానం చేశారు. గోదావరిఖని శాలపల్లి లోని మృతుడి కుమారుడు మామిడి కుమారస్వామి నివాసంలో ఈ నేత్రదాన కార్యక్రమాన్ని సదాశయ ఫౌండేషన్, రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎల్వీ ప్రసాద్ ఐ బ్యాంక్ టెక్నీషియన్ ప్రదీప్ నాయక్ సహకారంతో ఫౌండేషన్ జాతీయ ప్రచార కార్యదర్శి కే ఎస్ వాసు ద్వారా విజయవంతంగా నిర్వహించారు. వారి నిర్ణయంతో ఇద్దరు అంధుల జీవితాల్లో వెలుగు నిండనుంది. వ్యక్తిగత దుఃఖంలోనూ దానగుణం ఎలా ఉండాలో ఈ సోదరులు సమాజానికి స్ఫూర్తిగా నిలిచారని పలువురు ప్రశంసించారు. ఇందుకు సహకరించిన మృతుని భార్య లక్ష్మీతోపాటు వారి కుటుంబ సభ్యులను సదాశయ ఫౌండేషన్ సభ్యులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ సీనియర్ కార్యదర్శి, ఎంబీసీ మెంబర్ బాబర్ సలీం పాషా, ప్రెస్ క్లబ్ జనరల్ సెక్రటరీ గడ్డం శ్యామ్ కుమార్, కోశాధికారి రాజ్ కుమార్, క్లబ్ మాజీ అధ్యక్షులు పూదరి కుమార్ ,పందిళ్ళ శ్యామ్ సుందర్, సీనియర్ పాత్రికేయులు పెద్దపల్లి సత్యం, సాగర్, జక్కం సత్యనారాయణ,అరెల్లి.కుమార్,మధుకర్,విజయ్,బైరం సతీష్,శేఖర్, రవిందర్ ,కోడం రఘు,డాక్టర్ సంపత్ కుమార్,
కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండీ.రహీం, మాజీ కార్పొరేటర్లు వెంగల బాపు పద్మ, కృష్ణవేణి, ఐఎన్టియూసి జిల్లా అధ్యక్షుడు భూమళ్ళ చందర్, డివిజన్ ఇంచార్జీ ఈదునూరి రవి, సదాశయ ఫౌండేషన్ జాతీయ ప్రచార కార్యదర్శి వాసులతోపాటు
తదితరులు పాల్గొన్నారు.