చర్చ , రామగిరి: కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు సన్మానo
కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు సన్మానo
రామగిరి మండల కేంద్రమైన సెంటే నరి కాలనీ, INTUC శ్రీ పాద భవనం లో గురువారం ఉదయం 11 గంటలకు రామగిరి మండలంలో కాంగ్రెస్ పార్టీ బలపరచి గెలుపొందిన గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు మరియు వార్డు సభ్యులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించబడుతుందని, మండల కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని గ్రామ శాఖ అధ్యక్షులతో పాటు,మాజీ ప్రజా ప్రతినిధులు,మహిళా నాయకులు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,అన్ని విభాగాల నాయకులు మరియు కార్యకర్తలు తప్పక హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరడమైనది.