News & Views

చర్చ : నందా తండా ,చుంచుపల్లి మండలం , సర్పంచ్ అభ్యర్థిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన గ్రామస్థులు…

మాజీ సర్పంచ్ ఏమని ఓట్లు అడుగుతాడు?
గత పదవి కాలంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదు.
-సర్పంచ్ అభ్యర్థిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన గ్రామస్థులు

చుంచుపల్లి మండలం, నందతండా గ్రామ పంచాయతీ అభివృద్ధి కి పదుల మైల్ల దూరంలో, పారిశుధ్యానికి వందల మైల్ల దూరంలో ఉన్న సంగతి అందరికి విధితమే. విస్తీర్ణం లో మండలం లోనే అతి పెద్ద పంచాయతీ, 1600 పై చిలుకు ఓటర్లు ఉన్నప్పటికీ, సొంత పంచాయతీ కార్యాలయం లేని దుస్థితి, వీధి లైట్లు లేని వీధులు, చెత్త కుండీలు లేక చెత్తలు, వాటిని రోడ్ల మీద పరిచే కోతులు, వెంట పడే కుక్కలు, చెట్లకు నీళ్లు లేవు, వీధులలోకి వదిలిన వాడుక నీరు రోడ్ల మీదకి ప్రవహిస్తున్న పరిష్కారం చూపే పరిస్థితి లేదు. రోడ్లన్నీ గుంతలు, దోమలతో నిండిన వీధులు, అనారోగ్యాలతో గ్రామస్థులు. కారణం మాజీ సర్పంచ్ అంటున్నారు గ్రామస్థులు. ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా అని 600 పై చిలుకు ఉన్న గిరిజనేతర గ్రామస్థుల ఓట్లతో గెలిచి, గెలిచిన కొద్ది కాలం లోనే అనారోగ్యం కారణం తో కాలం చేసి పంచాయతీ ని చీకట్లో వదిలి వెళ్లిపోయారు. తండ్రి భాద్యత తీసుకున్న కుమారులు పంచాయతీని ఘడాంధకారం లోకి నెట్టేసారు. వారి నివాస ప్రాంతమైన నంద తండా పరిసర వీధులు ఇప్పటికి చీకట్లోనే ఉన్నాయ్. ప్రతి సంవత్సరం ప్రభుత్వం కేటాయించే నిధులు ఏమైపోయాయి? నిధులని, పంచాయతీ అభివృద్ధి కి వినియోగించకుండా దుర్వినియోగం చేసారు, భూ ఆక్రమనదారులకి సహకరిచారు, ఇంటి నిర్మాణం లేకుండానే ఇంటి పన్నులు ఇచ్చారు, వాటికి లక్షల్లో వసూలు చేసారు, భూ ఆక్రమణదారులకి సహకరించి పంచాయతీ నిధులతో ఇళ్ళు లేని చోట రోడ్లు నిర్మాణం చేసారనే ఆరోపణలు ఉన్నాయ్. ప్రతి రోజు పదుల సంఖ్యలో ట్రాక్టర్ లలో మట్టిని తరలించే వారు, అంగన్వాడీ కేంద్రం వర్షా కాలం లో మునిగే పరిస్థితి, మట్టి పోయించండి అని వేడిన పట్టించుకున్న పరిస్థితి లేదు. మెషిన్ భగీరధ మరొక అవినీతికి చెందిన పని. అవసరం లేని చోట, ఇళ్ళు లేని చోట పైప్ లైన్స్ వేయించారు. సొంత పంచాయతీ కార్యాలయం లేదు. ఫిర్యాదు కొరకు వెళ్తే ఇంటి వరకు రప్పించున్న పరిస్థితి, ఇంటికి వెళ్తే పట్టించుకోని పరిస్థితి. ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదన్న అని గ్రామస్థులు పాడుకున్న రోజులే ఎక్కువ. రాందాస్ తండా, అంబేద్కర్ నగర్, హౌసింగ్ బోర్డు నుండి బంజారాహిల్స్ వరకు ఉన్న గ్రామాలన్నీ అభివృద్ధి లో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లాయి. భూ ఆక్రమణలో మాత్రం ఏ ఐ ( ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ) తో పోటీ పడుతుంది. భూ ఆక్రమణదారులకి సహకరించి, ఇంటి నెంబర్ లు మంజూరు చేసి, పంచాయతీ నిధులు దుర్వినియోగం చేసి కోట్లు సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయ్. ఆ కోట్ల, నోట్లతో ఓట్లను గణించడానికి మళ్ళీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసాడు. గత పదవి కాలం లో ఎటువంటి అభివృద్ధి చేయలేదు, ఓట్లు వేయండి అని ఎలా అడుగుతారు. సిగ్గుండాలి నోట్లతో ఓట్లని కొనడానికి, ఓట్లని నోట్లకి అమ్ముకోవడానికి అని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వతంత్ర భారతంలో నోటు గెలిచిన రోజులు, ఓటు ఓడిన రోజులే ఎక్కువ. నంద తండా అభివృద్ధికి నోచుకుంటుందా? అన్నది ప్రశ్నర్దాకమే.