News & Views

చర్చ:మహబూబాబాద్ :భారీ వర్షాల కారణంగా డోర్నకల్ లో గోల్కొండ ఎక్ష్ప్రెస్స్ మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో కృష్ణ ఎక్స్‌ప్రెస్,నిలిపివేత…..

డోర్నకల్ రైల్వేస్టేషన్ లో ప్రయాణికులకు ఆహారపదార్ధాలు, వాటర్ బాటిల్స్ అందించిన జిల్లా ఎస్పీ ...

చర్చ:మహబూబాబాద్ జిల్లా

డోర్నకల్ రైల్వేస్టేషను పరిశీలించిన జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్..

భారీ వర్షాల కారణంగా డోర్నకల్ లో గోల్కొండ ఎక్ష్ప్రెస్స్ మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో కృష్ణ ఎక్స్‌ప్రెస్,నిలిపివేత…

డోర్నకల్ రైల్వేస్టేషన్ లో ప్రయాణికులకు ఆహారపదార్ధాలు, వాటర్ బాటిల్స్ అందించిన జిల్లా ఎస్పీ ….

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా డోర్నకల్ లో గోల్కొండ ఎక్ష్ప్రెస్స్ మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో కృష్ణ ఎక్స్‌ప్రెస్ రైలు నిలిపివేయడం జరిగింది…

ఈ సందర్భంగా రైలులో ఉన్న ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ వెంటనే స్పందించి సంబంధిత పోలీసు అధికారులను సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు…

ఎస్పీ ఆదేశాల మేరకు మహబూబాబాద్ టౌన్ సీఐ మహేందర్ రెడ్డి , రూరల్ సీఐ సరవయ్య , డోర్నకల్ సీఐ చంద్రమౌళి సిబ్బంది, ఎస్ఐలు , కానిస్టేబుళ్లు రైల్వే స్టేషన్‌కు చేరుకొని రైలులోని ప్రయాణికులకు వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్లు, పులిహోర పొట్లాలు అందజేశారు. రైలు ఆలస్యం అయినప్పటికీ, ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా పోలీసు సిబ్బంది సకాలంలో సహాయం అందించి మానవ సేవను చాటారు…