చర్చ పెద్దపల్లి: నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు.
24 గంటల నిరాహార దీక్ష కార్యక్రమం లో పాల్గొని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు

చర్చ పెద్దపల్లి .
నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు.
హైదరాబాద్ లో ఇందిరాపార్క్ వద్ద బీసీ రిజర్వేషన్ సాధన కోసం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యం ఆధ్వర్యంలో నిర్వహించిన 24 గంటల నిరాహార దీక్ష కార్యక్రమం లో పాల్గొని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మద్దతు పలికారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు అబద్దాలు చెప్పి, అధికారం వచ్చాక మేము బీసీ రిజర్వేషన్ కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాము. కేంద్రం లో ఉన్న BJP ప్రభుత్వం ఒప్పుకోవడం లేదని 22 నెలల నుండి అబద్దాల తో కాలయాపన చేస్తున్నారని ఏద్దెవా చేశారు. ఇప్పటికైన అబద్దాల కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేసారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామిలు నేరవేర్చక పోతె రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కనుమరుగవ్వడం
ఖాయమని అన్నారు.ఈ కార్యక్రమం లో
పుట్ట మధుతో పాటు బీసీ నాయకులు రచ్చపల్లి మాజీ సర్పంచ్ కనవేన శ్రీనివాస్, బహుజన సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు తగరం శంకర్ లాల్ పాల్గొన్నారు