చర్చ:- హుస్నాబాద్: నాయకుడిలా కాదు సేవకుడిలా పనిచేస్తా

సిద్దిపేట జిల్లా
చర్చ:- హుస్నాబాద్: మున్సిపల్ లో
4వార్డు సమస్యలను నెరవేరుస్తా.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి
హుస్నాబాద్ పట్టణంలోని నాల్గవ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిల్లి తిరుపతి. కాంగ్రెస్ కుటుంబ సభ్యులతో కలిసి ఇంటింటి ప్రచారంలో వార్డు ప్రజలను కలుస్తూ.మీ అమూల్యమైన ఓటును చేతి గుర్తుపై ఓటు వేసి పిల్లి తిరుపతిని గెలిపించవలసిందిగా కోరడమైనది. హుస్నాబాద్ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశీస్సులతో వార్డుల్లోని అన్ని సమస్యలను నెరవేరుస్తామని ప్రచారం నిర్వహించారు.వార్డులో ప్రజలను కలిసి కనీస మౌలిక సదుపాయాలనుగుర్తించివారితో మాట్లాడుతూ ఆ సమస్యలను తీర్చే కార్యక్రమంలో పూర్తిస్థాయి బాధ్యత తీసుకుంటానని, అందరికీ అందుబాటులో ఉంటానని, ప్రభుత్వ పథకాలలో ముఖ్యంగా రేషన్ కార్డ్, ఇందిరమ్మ ఇల్లు, మహిళలకు ఉచిత బస్సుసౌకర్యం అలాగే 200 యూనిట్ల కరెంటుమొదలగు కార్యక్రమాలపై వివరిస్తూ ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వార్డు ఇన్చార్జీలు, హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.