News & Views

చర్చ, జగిత్యాల : జగిత్యాల సమగ్ర అభివృద్ధి కై నిరంతరం కృషి చేస్తా – ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్!

జగిత్యాల సమగ్ర అభివృద్ధి కై నిరంతరం కృషి చేస్తా – ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్!

చర్చ, జగిత్యాల : ప్రజలందరి భాగస్వామ్యంతో జగిత్యాల సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. మంగళవారం పట్టణం లోని 14 వ వార్డు లో 15 లక్షల వ్యయం తో చేపట్టనున్న సి. సి రోడ్డు, డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శంకులపల్లె, పోచమ్మ వాడ ప్రాంతం పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంత మన్నారు. ఇక్కడి రైతుల ఉత్పత్తుల విక్రయాల కోసం పట్టణ నలువైపులా మార్కెట్ల ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గతంలో శంకులపల్లె, విజయపురి ప్రాంతాలు రైల్వే జోన్ పరిధిలో ఉండేవన్నారు. ఈ ప్రాంతాల్లో ఇంటి నిర్మానాలకు అనుమతులు వచ్చేవి కావని తానే స్వయంగా జోన్ల మార్పిడి చేయించడం తో ఇప్పుడు సమస్య పరిష్కారం అయ్యిందన్నారు. గత పాలకులు ఏనాడు జోన్ల మార్పిడిపై పట్టించుకోకపోవడంతోనే ఇష్టా రీతిలో నిర్మాణాలు జరిగాయాన్నారు. లే అవుట్ ప్రకారం నిర్మాణాలకు ప్రజలు స్వచందంగా ముందుకు రావాలని ఎమ్మెల్యే కోరారు. ఎస్ కే ఎన్నార్ కళాశాల పరిసర ప్రాంతాల్లో నీటి కొరత ఉందని గుర్తించి కళాశాల ఆవరణలో 2 కోట్ల 50 లక్షల తో 15 లక్షల నీటి సామార్త్యము కలిగిన వాటర్ ట్యాంక్ నిర్మాణం పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే చెప్పారు. ప్రజల భాగస్వామ్యం తోనే జగిత్యాల సమగ్ర అభివృద్ధి కి కృషి జరుగుతోందని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, అడువల జ్యోతి లక్ష్మణ్, తాజా మాజీ కౌన్సిలర్ లు కూతురు పద్మ, బద్దం జగన్ మోహన్ రెడ్డి, కూతురు రాజేష్, పిట్ట ధర్మరాజు, పంబాల రాము, తిరుమలయ్య, గంగన్న, లింగారెడ్డి, చెట్పల్లి సుధాకర్, కూతురు శేఖర్, దుమాల రాజ్ కుమార్, డి ఈ ఆనంద్, ఏఈ అనిల్, పట్టణ వార్డు ముఖ్య నాయకులు మున్సిపల్ సిబ్బంది మహిళలు తదితరులు పాల్గొన్నారు.