News & Views

చర్చ, భద్రాచలం : వార్డు మెంబర్ గా తప్పుకుంటే గ్రంధాలయం చైర్మన్ పదవి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం

వార్డు మెంబర్ గా తప్పుకుంటే గ్రంధాలయం చైర్మన్ పదవి …(ఎక్స్ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ) – ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు

చర్చ….మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్ పొదేం వీరయ్య అనుచరుడిగా పేరుగాంచినటువంటి కాపుల శ్రీను (యేసు )14 వ వార్డు మెంబర్ గా కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేశారు , అయితే 14 వ వార్డు మెంబర్ గా కాపులు యేసుని నామినేషన్ విరమించుకోవాలని ఎక్స్ ఎమ్మెల్సీ బాలసాని మరియు ప్రస్తుత ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు కోరారు దీంతో ఒప్పుకోని కాపులు శ్రీను (యేసు) అవసరమైతే ఇండిపెండెంట్ క్యాండెట్ గా అయినా నిలబడతాను కానీ నేనైతే తప్పుకోవడం జరగదని అధిష్టానానికి తెలిపారు .
దీంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో వీరయ్యతో మాట్లాడి భద్రాచలం గ్రంథాలయ చైర్మన్ పదవి ఎలక్షన్ కోడ్ అయిపోగానే అనౌన్స్ చేయడం జరుగుతుందని 14 వ వార్డు మెంబర్ మీ అనుచరుడు నామినేషన్ వివరించుకోవాలని తెలిపారు దీంతో వీరయ్య సర్ది చెప్పి గ్రంథాలయ చైర్మన్ గా పదవి తీసుకో వార్డ్ మెంబర్ గా తప్పుకో అని హామీ ఇవ్వగా కాపులు యేసు నామినేషన్ విరమించుకోవడం జరిగింది