చర్చ, ఏటూరు నాగారం: గిరిజనుల పట్టా భూమిలో గిరిజనేతరలు అక్రమ కట్టడాలు

- ట్రైబల్ కోర్ట్ ఎల్టీఆర్ నోటీసులు ఇచ్చిన పట్టించుకోకుండా కట్టడాన్ని నిర్మిస్తున్న అక్రమార్కులు
గిరిజనులను బెదిరిస్తూ భయపెడుతూ దౌర్జనంగా గిరిజనుల పట్టా భూమిలో అక్రమ కట్టడాలు కడుతున్న మహమ్మద్ హుస్సేన్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిట్ కేసు నమోదు చేసి అక్రమ కట్టడాలను నిలుపుదల చేయాలని మన్య సీమ పరిరక్షణ సమితి డోలు దెబ్బ రాష్ట్ర నాయకులు ఈసం యాదయ్య డిమాండ్
ములుగు జిల్లా మంగపేట మండలంలోని పోద్మూర్ రెవెన్యూ గ్రామంలో ఆదివాసి గిరిజన తెగకు చెందిన ముక్తి పాపయ్య తండ్రి పొట్టి పేరుమీద ఉన్న సర్వేనెంబర్ 95,96 లో 2 : 30 గుంటల పట్టా భూమిలో మహమ్మద్ హుస్సేన్ అనే గిరిజనేతరులు అక్రమంగా ఆక్రమించుకొని గిరిజన చట్టాలు 1/59 ,1/70, పెసా ఎల్టిఆర్ చట్టాలకు విరుద్ధంగా వ్యతిరేకంగా గిరిజనుల పట్టా భూములను ఆక్రమించుకొని అక్రమంగా కడుతున్న ఇంటి నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని మన్యసీమ పరిరక్షణ సమితి డోలు దెబ్బ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఇట్టి గిరిజనేతరులు చేపడుతున్న భవన నిర్మాణం స్థలాన్ని పరిశీలించి గిరిజనులదే పట్టా భూమి అని డాక్యుమెంట్ తో సహా మొత్తం చూడడం జరిగింది పూర్తిగా గిరిజనుల పట్టా భూమి అన్ని నిర్ధారించడం జరిగింది ఇది ఎట్టి పరిస్థితుల్లో గిరిజనులకే చందాల్సిన భూమి ట్రైబల్ కోర్ట్ ఎల్టీఆర్ నోటీసు ఉన్నప్పటికీ గిరిజనుల చట్టాలకు విరుద్ధంగా అక్రమంగా నిన్న స్లాబ్ పోయడం జరిగింది ఇట్టి గిరిజనేతరుల అక్రమ కట్టడాన్ని నిలుపుదల చేయాలని ఆదివాసి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గిరిజనుల పట్టా భూమి గిరిజనులకు ఇప్పించాలని జిల్లా కలెక్టర్, ఐటిడిఏ పి ఓ, మండల తాహసిల్దార్ ను కోరిన మన్య సీమ పరిరక్షణ సమితి డోలు దెబ్బ కమిటీ డిమాండ్ ఈ కార్యక్రమంలో, మన్యసీమ మండల అధ్యక్షుడు తాటి నాగరాజు, తోలేం నరసింహారావు, గొప్ప చంద్రకాంత్, అన్నేబోయిన సమ్మయ్య, తోలేం సుధాకర్, చాదా హరి, చీమల నాగభూషణం, జోగా బాబు, మన్య సీమ జిల్లా మహిళా నాయకులు,ఇరుప అరుణ, తోలేం సౌమ్య, ముక్తి రవి, రాములు, లక్ష్మి, పాపారావు, తదితరులు పాల్గొన్నారు.