News & Views

చర్చ, కరీంనగర్: కులాంతర వివాహ ప్రోత్సాహక ఫిక్స్డ్ బాండ్ అందజేత రూ.2,50,000 విలువైనది అందించిన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

  • కులాంతర వివాహ ప్రోత్సాహక ఫిక్స్డ్ బాండ్ అందజేత
  • రూ.2,50,000 విలువైనది అందించిన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

ప్రభుత్వం ద్వారా మంజూరైన కులాంతర వివాహ ప్రోత్సాహక ఫిక్స్డ్ బాండ్ ను రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ అందజేశారు. ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన జక్కుల ప్రియాంక కులాంతర వివాహం చేసుకొని ప్రభుత్వ ప్రోత్సాహకం కోసం ఎస్సీ సంక్షేమ శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సీ సంక్షేమ శాఖ నుంచి మంజూరు అయిన రూ. 2,50,000 విలువైన ఫిక్స్డ్ బాండ్ ను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం జక్కుల ప్రియాంకకు అందజేశారు. జిల్లాలో ఇప్పటిదాకా 180 దరఖాస్తులు రాగా, 57 మందికి రూ.1 కోటి 42 లక్షల 60 వేలు పంపిణీ చేశామని, మరో 11 మందికి త్వరలోనే ప్రోత్సాహక ఫిక్స్డ్ బాండ్లను పంపిణీ చేస్తామని, మిగతా వారికి ఎస్సీ కమిషనర్ నుంచి మంజూరు అయిన తర్వాత ఇస్తామని జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు.