News & Views

చర్చ, కొత్తగూడెం : మంత్రి పొంగులేటి నాయకత్వంలో కొత్వాల ఆధ్వర్యంలో ఘనంగా ఇందిరమ్మ జయంతి వేడుకలు

ఇందిరమ్మ జయంతి వేడుకలు

 

మంత్రి పొంగులేటి నాయకత్వంలో కొత్వాల ఆధ్వర్యంలో ఘనంగా ఇందిరమ్మ జయంతి వేడుకలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…
చర్చ పాల్వంచ

భారత మాజీ ప్రధాని, భారతరత్న, ఉక్కు మహిళ, దివంగత ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో కొత్వాల ఆధ్వర్యంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఆటో యూనియన్ నాయకులు పలు కార్యక్రమాలు నిర్వహించారు.

స్థానిక పాల్వంచ దమ్మపేట సెంటర్ లోని ఇందిరాగాంధీ విగ్రహానికి కొత్వాల తోపాటు కాంగ్రెస్ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు. బర్త్ డే కేక్ కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టారు.

ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ గరీబీ హటావో, బ్యాంకుల జాతీయం, రాజభరణాల రద్దు, 20 సూత్రాలు వంటి విప్లవాత్మక నిర్ణయాలతో* దేశ ప్రగతి కోసం పాటుపడిన ఇందిరమ్మ చిరస్మరణీయురాలని అన్నారు.

ఈ కార్యక్రమాల్లో మాజీ ZP చైర్మన్ బరిపటి వాసుదేవరావు, మాజీ ZPTC యర్రంశెట్టి ముత్తయ్య, INTUC నాయకులు SA జలీల్, కాంగ్రెస్ నాయకులు మహీపతి రామలింగం, కాల్వ భాస్కర రావు, SVRK ఆచార్యులు, పైడిపల్లి మహేష్, చెన్నూరి రాము, కాపర్తి వెంకటాచారి, Y వెంకటేశ్వర్లు (YV), దారా చిరంజీవి, గంగిరెడ్డి భువన సుందరరెడ్డి, డిష్ నాగేశ్వరరావు, బాలు నాయక్, మల్లిఖార్జున్, బాశెట్టి సాంబయ్య, SK గద్దర్ బాషా, కటుకూరి శేఖర్ బాబు, భూక్యా గిరి ప్రసాద్, GV రత్నం, పరుపర్తి వెంకటేశ్వర్లు, అగ్నిమండలం భాస్కర్, మందా మురళి, రఫీ, అలవాల నాగేశ్వరరావు, దాసరి యాకయ్య, N భవాని ప్రసాద్, సక్రు, జగదీష్, అనిల్ , తదితరులు పాల్గొన్నారు.